సముద్ర తీరంలో ఘోర విషాదం.. పడవలు మునిగి 500 మందికిపైగా మృతి! |
గురువారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ రెండు సంస్థలు కీలక వివరాలను వెల్లడించాయి. జూన్ చివరి వారంలో మయన్మార్ పశ్చిమ ప్రాంతమైన రఖైన్ రాష్ట్రం నుంచి ఈ రెండు పడవలు బయలుదేరినట్లు పేర్కొన్నాయి. వాటిలో ప్రయాణించిన వారిలో అత్యధికులు రోహింగ్యా ముస్లిం శరణార్థులేనని తెలిపాయి. CNN కథనం ప్రకారం… సుమారు 250 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఒక పడవ ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే సంబంధాలు కోల్పోయింది. మరోవైపు దాదాపు 280 మంది ఉన్న మరో పడవ…
