ప్రభన్యూస్

వెల్‌నెస్ నుంచి కేఫేల వరకు… ఈబీజీ గ్రూప్‌లో ఆర్మా క్యాపిటల్ భారీ పెట్టుబడి | Arma Capital to Invest Over Rs 100 Crore in EBG Group Brands | బిజినెస్


Last Updated:

హైదరాబాద్‌కు చెందిన ఈబీజీ గ్రూప్‌కి చెందిన వెల్‌నెస్, ఫుడ్, ఫ్యామిలీ బిజినెస్‌లలో మహారాష్ట్రకు చెందిన ఆర్మా క్యాపిటల్ రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడితో పలు వినియోగదారుల బ్రాండ్లలో ఆర్మా క్యాపిటల్ భాగస్వామిగా మారింది.

వెల్‌నెస్ నుంచి కేఫేల వరకు... ఈబీజీ గ్రూప్‌లో ఆర్మా క్యాపిటల్ భారీ పెట్టుబడి
వెల్‌నెస్ నుంచి కేఫేల వరకు… ఈబీజీ గ్రూప్‌లో ఆర్మా క్యాపిటల్ భారీ పెట్టుబడి

మహారాష్ట్రకు చెందిన ఆర్మా క్యాపిటల్, ఈబీజీ గ్రూప్‌కి చెందిన వెల్‌నెస్, ఫుడ్, ఫ్యామిలీ బిజినెస్‌లలో మొత్తం రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈబీజీ గ్రూప్‌కి చెందిన పలు కన్స్యూమర్ బ్రాండ్లలో ఆర్మా క్యాపిటల్ పెట్టుబడి పెట్టడం ఇదే తొలిసారి. ఈ పెట్టుబడిలో ముంబై, బెంగళూరు, చండీగఢ్‌లో ఉన్న కార్ల్టన్ వెల్‌నెస్ సెంటర్లతో పాటు హైదరాబాద్‌లోని నాటుఫ్ కేఫ్, అధిరా & అప్పా కేఫ్, ఛోటా భీమ్ ఫ్యామిలీ కేఫ్‌లతో ఫ్రాంచైజీ భాగస్వామ్యాలు కూడా ఉన్నాయి. ఈబీజీ గ్రూప్‌తో భాగస్వామ్యం కంటే ముందు కూడా ఆర్మా క్యాపిటల్ కన్జ్యూమర్ బ్రాండ్లు, హాస్పిటాలిటీ, లైఫ్‌స్టైల్ అనుభవాలకు సంబంధించిన బిజినెస్‌లలో పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు ఈబీజీ గ్రూప్‌లో పెట్టుబడి ద్వారా నగరాలు, మార్కెట్లలో విస్తరించే అవకాశం ఉన్న కన్జ్యూమర్ బిజినెస్‌లపై తన దృష్టిని మరింత పెంచుతోంది. ఇందులో వెల్‌నెస్, ఫుడ్, ఫ్యామిలీ ఎక్స్‌పీరియన్స్ బిజినెస్‌లు కూడా చేరాయి.

ప్రస్తుతం పెట్టిన రూ.10 కోట్ల పెట్టుబడి ఆర్మా క్యాపిటల్, ఈబీజీ గ్రూప్ మధ్య భాగస్వామ్యానికి మొదటి దశ. పెద్ద భాగస్వామ్యంలో భాగంగా రాబోయే ఐదేళ్లలో రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని ఆర్మా క్యాపిటల్ నిర్ణయించింది. ఈ పెట్టుబడులు కార్ల్టన్ వెల్‌నెస్ సెంటర్, టార్జన్ నేచర్ రిట్రీట్, అధిరా అండ్ అప్పా కాఫీ, నాటుఫ్ కేఫ్, ఛోటా భీమ్ కేఫ్‌తో పాటు భవిష్యత్తులో ఈబీజీ గ్రూప్ ప్రారంభించే కొత్త బ్రాండ్లలో కూడా ఉంటాయి. చండీగఢ్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్ వంటి ప్రధాన నగరాల్లో ఈ బ్రాండ్లను విస్తరించేందుకు ఈ పెట్టుబడులు ఉపయోగపడనున్నాయి.

ఇది కూడా చదవండి: Family Car: రూ.7.84 లక్షలకే 7 సీటర్ కారు… 21 కిమీ మైలేజ్, టర్బో ఇంజిన్

ఆర్మా క్యాపిటల్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ జైన్ మాట్లాడుతూ, “ప్రతిరోజూ వినియోగదారులకు అవసరమైన సేవలను అందించే, పలు నగరాల్లో విస్తరించే అవకాశం ఉన్న బిజినెస్‌ల కోసం చూస్తున్నాం. ఈబీజీ గ్రూప్ వెల్‌నెస్, ఫుడ్, ఫ్యామిలీ ఎక్స్‌పీరియన్స్ బ్రాండ్లను ఒకే వ్యవస్థలోకి తీసుకొచ్చింది. అందుకే ఈ భాగస్వామ్యం మాకు సహజమైన ఎంపికగా అనిపించింది. ఈ బ్రాండ్లు మరింత మంది వినియోగదారులకు చేరడంతో పాటు దీర్ఘకాలంలో మంచి విలువను సృష్టించే అవకాశం ఉందని మేము నమ్ముతున్నాం” అని చెప్పారు.

ఈ పెట్టుబడిపై ఈబీజీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ మాట్లాడుతూ, “ఈబీజీకి చెందిన పలు బ్రాండ్లలో ఆర్మా క్యాపిటల్ పెట్టుబడి పెట్టడం మేము నిర్మించిన బిజినెస్‌లపై వారికి ఉన్న నమ్మకాన్ని చూపిస్తోంది. మా దీర్ఘకాలిక విజన్‌పై వారు ఉంచిన విశ్వాసానికి ఇది నిదర్శనం. వెల్‌నెస్, ఫుడ్, ఫ్యామిలీ ఎక్స్‌పీరియన్స్ బిజినెస్‌లలో వారి భాగస్వామ్యం మా నమ్మకాన్ని మరింత బలపరుస్తోంది. మంచి బేస్ ఉన్న కన్జ్యూమర్ బ్రాండ్లు దేశవ్యాప్తంగా విస్తరించగలవని మేము నమ్ముతున్నాం. కలిసి ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నాం” అని చెప్పారు.

ఇది కూడా చదవండి: IRCTC Tour: రూ.18 వేలకే 7 జ్యోతిర్లింగాల దర్శనం… మరోసారి హైదరాబాద్ నుంచి 11 రోజుల యాత్ర

ఈ భాగస్వామ్యం ద్వారా ఆర్మా క్యాపిటల్ పెట్టుబడి, విస్తరణ ప్రణాళికలు, ఈబీజీ గ్రూప్‌కు చెందిన కన్జ్యూమర్ బ్రాండ్లు ఒకే వేదికపైకి వస్తున్నాయి. ఆర్మా క్యాపిటల్‌కు పలు బిజినెస్‌ల్లో తన కార్యకలాపాలను విస్తరించే అవకాశం లభిస్తుంది. ఈబీజీ గ్రూప్‌కు కొత్త నగరాల్లో తన బ్రాండ్లను విస్తరించేందుకు దీర్ఘకాలిక పెట్టుబడి, ఫ్రాంచైజీ భాగస్వామి లభించినట్టవుతుంది. మొత్తంగా చూస్తే, ఈ భాగస్వామ్యం ద్వారా భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు, కొత్త ఫ్రాంచైజీ సెంటర్లు, దేశవ్యాప్తంగా కొత్త కన్జ్యూమర్ బ్రాండ్లను ప్రారంభించే అవకాశాలకు వేదిక ఏర్పడనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 September 2026, 3:30 pm Digital Edition : Prabhanews
వెల్‌నెస్ నుంచి కేఫేల వరకు… ఈబీజీ గ్రూప్‌లో ఆర్మా క్యాపిటల్ భారీ పెట్టుబడి | Arma Capital to Invest Over Rs 100 Crore in EBG Group Brands | బిజినెస్

Last Updated:Sep 29, 2026 3:25 PM ISTహైదరాబాద్‌కు చెందిన ఈబీజీ గ్రూప్‌కి చెందిన వెల్‌నెస్, ఫుడ్, ఫ్యామిలీ బిజినెస్‌లలో మహారాష్ట్రకు చెందిన ఆర్మా క్యాపిటల్ రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడితో పలు వినియోగదారుల బ్రాండ్లలో ఆర్మా క్యాపిటల్ భాగస్వామిగా మారింది.వెల్‌నెస్ నుంచి కేఫేల వరకు... ఈబీజీ గ్రూప్‌లో ఆర్మా క్యాపిటల్ భారీ పెట్టుబడిమహారాష్ట్రకు చెందిన ఆర్మా క్యాపిటల్, ఈబీజీ గ్రూప్‌కి చెందిన వెల్‌నెస్, ఫుడ్, ఫ్యామిలీ బిజినెస్‌లలో మొత్తం రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈబీజీ గ్రూప్‌కి చెందిన పలు కన్స్యూమర్ బ్రాండ్లలో ఆర్మా క్యాపిటల్ పెట్టుబడి పెట్టడం ఇదే తొలిసారి. ఈ పెట్టుబడిలో ముంబై, బెంగళూరు, చండీగఢ్‌లో ఉన్న కార్ల్టన్ వెల్‌నెస్ సెంటర్లతో పాటు హైదరాబాద్‌లోని నాటుఫ్ కేఫ్, అధిరా & అప్పా కేఫ్, ఛోటా భీమ్ ఫ్యామిలీ కేఫ్‌లతో ఫ్రాంచైజీ భాగస్వామ్యాలు కూడా ఉన్నాయి. ఈబీజీ గ్రూప్‌తో భాగస్వామ్యం కంటే ముందు కూడా ఆర్మా క్యాపిటల్ కన్జ్యూమర్ బ్రాండ్లు, హాస్పిటాలిటీ, లైఫ్‌స్టైల్ అనుభవాలకు సంబంధించిన బిజినెస్‌లలో పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు ఈబీజీ గ్రూప్‌లో పెట్టుబడి ద్వారా నగరాలు, మార్కెట్లలో విస్తరించే అవకాశం ఉన్న కన్జ్యూమర్ బిజినెస్‌లపై తన దృష్టిని మరింత పెంచుతోంది. ఇందులో వెల్‌నెస్, ఫుడ్, ఫ్యామిలీ ఎక్స్‌పీరియన్స్ బిజినెస్‌లు కూడా చేరాయి.ప్రస్తుతం పెట్టిన రూ.10 కోట్ల పెట్టుబడి ఆర్మా క్యాపిటల్, ఈబీజీ గ్రూప్ మధ్య భాగస్వామ్యానికి మొదటి దశ. పెద్ద భాగస్వామ్యంలో భాగంగా రాబోయే ఐదేళ్లలో రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని ఆర్మా క్యాపిటల్ నిర్ణయించింది. ఈ పెట్టుబడులు కార్ల్టన్ వెల్‌నెస్ సెంటర్, టార్జన్ నేచర్ రిట్రీట్, అధిరా అండ్ అప్పా కాఫీ, నాటుఫ్ కేఫ్, ఛోటా భీమ్ కేఫ్‌తో పాటు భవిష్యత్తులో ఈబీజీ గ్రూప్ ప్రారంభించే కొత్త బ్రాండ్లలో కూడా ఉంటాయి. చండీగఢ్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్ వంటి ప్రధాన నగరాల్లో ఈ బ్రాండ్లను విస్తరించేందుకు ఈ పెట్టుబడులు ఉపయోగపడనున్నాయి.ఇది కూడా చదవండి: Family Car: రూ.7.84 లక్షలకే 7 సీటర్ కారు... 21 కిమీ మైలేజ్, టర్బో ఇంజిన్ఆర్మా క్యాపిటల్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ జైన్ మాట్లాడుతూ, "ప్రతిరోజూ వినియోగదారులకు అవసరమైన సేవలను అందించే, పలు నగరాల్లో విస్తరించే అవకాశం ఉన్న బిజినెస్‌ల కోసం చూస్తున్నాం. ఈబీజీ గ్రూప్ వెల్‌నెస్, ఫుడ్, ఫ్యామిలీ ఎక్స్‌పీరియన్స్ బ్రాండ్లను ఒకే వ్యవస్థలోకి తీసుకొచ్చింది. అందుకే ఈ భాగస్వామ్యం మాకు సహజమైన ఎంపికగా అనిపించింది. ఈ బ్రాండ్లు మరింత మంది వినియోగదారులకు చేరడంతో పాటు దీర్ఘకాలంలో మంచి విలువను సృష్టించే అవకాశం ఉందని మేము నమ్ముతున్నాం" అని చెప్పారు.ఈ పెట్టుబడిపై ఈబీజీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ మాట్లాడుతూ, "ఈబీజీకి చెందిన పలు బ్రాండ్లలో ఆర్మా క్యాపిటల్ పెట్టుబడి పెట్టడం మేము నిర్మించిన బిజినెస్‌లపై వారికి ఉన్న నమ్మకాన్ని చూపిస్తోంది. మా దీర్ఘకాలిక విజన్‌పై వారు ఉంచిన విశ్వాసానికి ఇది నిదర్శనం. వెల్‌నెస్, ఫుడ్, ఫ్యామిలీ ఎక్స్‌పీరియన్స్ బిజినెస్‌లలో వారి భాగస్వామ్యం మా నమ్మకాన్ని మరింత బలపరుస్తోంది. మంచి బేస్ ఉన్న కన్జ్యూమర్ బ్రాండ్లు దేశవ్యాప్తంగా విస్తరించగలవని మేము నమ్ముతున్నాం. కలిసి ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నాం" అని చెప్పారు.ఇది కూడా చదవండి: IRCTC Tour: రూ.18 వేలకే 7 జ్యోతిర్లింగాల దర్శనం... మరోసారి హైదరాబాద్ నుంచి 11 రోజుల యాత్రఈ భాగస్వామ్యం ద్వారా ఆర్మా క్యాపిటల్ పెట్టుబడి, విస్తరణ ప్రణాళికలు, ఈబీజీ గ్రూప్‌కు చెందిన కన్జ్యూమర్ బ్రాండ్లు ఒకే వేదికపైకి వస్తున్నాయి. ఆర్మా క్యాపిటల్‌కు పలు బిజినెస్‌ల్లో తన కార్యకలాపాలను విస్తరించే అవకాశం లభిస్తుంది. ఈబీజీ గ్రూప్‌కు కొత్త నగరాల్లో తన బ్రాండ్లను విస్తరించేందుకు దీర్ఘకాలిక పెట్టుబడి, ఫ్రాంచైజీ భాగస్వామి లభించినట్టవుతుంది. మొత్తంగా చూస్తే, ఈ భాగస్వామ్యం ద్వారా భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు, కొత్త ఫ్రాంచైజీ సెంటర్లు, దేశవ్యాప్తంగా కొత్త కన్జ్యూమర్ బ్రాండ్లను ప్రారంభించే అవకాశాలకు వేదిక ఏర్పడనుంది.మరింత చదవండి

Source link