ప్రభన్యూస్

విశాఖలో హిల్టన్ ఎంట్రీ… 360 గదులతో కొత్త హోటల్… తిరుపతి, మంత్రాలయంలో కూడా | బిజినెస్


Last Updated:

విశాఖపట్నంలో 360 గదుల హిల్టన్ గార్డెన్ ఇన్ హోటల్ 2032లో ప్రారంభం కానుంది. బీవీఎం ఎనర్జీతో హిల్టన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో హిల్టన్ విస్తరణలో ఇది కీలక అడుగు.

విశాఖలో హిల్టన్ ఎంట్రీ... 360 గదులతో కొత్త హోటల్... తిరుపతి, మంత్రాలయంలో కూడా (ప్రతీకాత్మక చిత్రం)
విశాఖలో హిల్టన్ ఎంట్రీ… 360 గదులతో కొత్త హోటల్… తిరుపతి, మంత్రాలయంలో కూడా (ప్రతీకాత్మక చిత్రం)

విశాఖపట్నంలో ప్రముఖ అంతర్జాతీయ హాస్పిటాలిటీ సంస్థ హిల్టన్ అడుగుపెట్టబోతోంది. నగరంలో 360 గదులతో కొత్త హోటల్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ హోటల్ 2032లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో హిల్టన్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించనుంది. హిల్టన్ మంగళవారం హిల్టన్ గార్డెన్ ఇన్ విశాఖపట్నం యెండాడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) ప్రాజెక్ట్‌కు సంబంధించి బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. యెండాడలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ విశాఖపట్నం ప్రాజెక్ట్‌లో ఈ హోటల్ భాగంగా ఉంటుంది. కపిల్ గ్రూప్‌కు చెందిన సంస్థ చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ 10 ఎకరాల్లో నిర్మిస్తున్న మిక్స్‌డ్ యూజ్ డెవలప్‌మెంట్. ఇందులో వ్యాపారం, భాగస్వామ్యాలు, పరస్పర అనుసంధానానికి కొత్త కేంద్రంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

విశాఖపట్నంలో తమ తొలి హోటల్ ఏర్పాటు కావడం సంస్థకు ముఖ్యమైన అడుగని హిల్టన్ సౌత్ ఏషియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రీజినల్ హెడ్ జుబిన్ సక్సేనా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వాణిజ్య కేంద్రాల్లో ఒకటైన విశాఖపట్నంలో హిల్టన్ ఉనికి మరింత బలపడుతుందని ఆయన తెలిపారు. హాస్పిటాలిటీ రంగంలో విశాఖపట్నం దీర్ఘకాలికంగా మంచి అవకాశాలు ఉన్న నగరంగా తాము చూస్తున్నామని చెప్పారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో హిల్టన్ డెవలప్‌మెంట్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్లారెన్స్ టాన్ మాట్లాడుతూ, విశాఖపట్నం లాంటి ప్రాధాన్యం పెరుగుతున్న మార్కెట్లలో హోటళ్ల ఏర్పాటుతో కస్టమర్లకు మరిన్ని వసతి ఎంపికలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

ఇది కూడా చదవండి: Railway Rules: ట్రైన్ ఎక్కారా? రైల్వేలో ఈ రూల్స్ ఎక్కడా రాసి ఉండవు… కానీ ప్రతి ప్రయాణికుడూ తెలుసుకోవాల్సిందే!

కపిల్ గ్రూప్‌కు చెందిన బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వడ్డనపు కృష్ణయ్య మాట్లాడుతూ, విశాఖపట్నంలో వేగంగా పెరుగుతున్న బిజినెస్ ఎకోసిస్టమ్‌కు అనుగుణంగా తమ ప్రణాళికలను అమలు చేయడానికి హిల్టన్ సరైన భాగస్వామి అని చెప్పారు. బిజినెస్ ట్రావెలర్స్‌తో పాటు లీజర్ ట్రావెలర్స్‌కు కూడా మంచి హాస్పిటాలిటీ అనుభవాన్ని అందించాలన్న తమ లక్ష్యానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ఒప్పందంతో భారత్‌లో హిల్టన్ అప్‌స్కేల్ హాస్పిటాలిటీ పోర్ట్‌ఫోలియో మరింత విస్తరించనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో హిల్టన్‌కు మరో రెండు ప్రాజెక్టులు పైప్‌లైన్‌లో ఉన్నాయి. తిరుపతి, మంత్రాలయంలో హిల్టన్ గార్డెన్ ఇన్ హోటళ్లు త్వరలో రానున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 September 2026, 5:34 pm Digital Edition : Prabhanews
విశాఖలో హిల్టన్ ఎంట్రీ… 360 గదులతో కొత్త హోటల్… తిరుపతి, మంత్రాలయంలో కూడా | బిజినెస్

Last Updated:Sep 22, 2026 5:19 PM ISTవిశాఖపట్నంలో 360 గదుల హిల్టన్ గార్డెన్ ఇన్ హోటల్ 2032లో ప్రారంభం కానుంది. బీవీఎం ఎనర్జీతో హిల్టన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో హిల్టన్ విస్తరణలో ఇది కీలక అడుగు.విశాఖలో హిల్టన్ ఎంట్రీ... 360 గదులతో కొత్త హోటల్... తిరుపతి, మంత్రాలయంలో కూడా (ప్రతీకాత్మక చిత్రం)విశాఖపట్నంలో ప్రముఖ అంతర్జాతీయ హాస్పిటాలిటీ సంస్థ హిల్టన్ అడుగుపెట్టబోతోంది. నగరంలో 360 గదులతో కొత్త హోటల్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ హోటల్ 2032లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో హిల్టన్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించనుంది. హిల్టన్ మంగళవారం హిల్టన్ గార్డెన్ ఇన్ విశాఖపట్నం యెండాడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) ప్రాజెక్ట్‌కు సంబంధించి బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. యెండాడలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ విశాఖపట్నం ప్రాజెక్ట్‌లో ఈ హోటల్ భాగంగా ఉంటుంది. కపిల్ గ్రూప్‌కు చెందిన సంస్థ చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ 10 ఎకరాల్లో నిర్మిస్తున్న మిక్స్‌డ్ యూజ్ డెవలప్‌మెంట్. ఇందులో వ్యాపారం, భాగస్వామ్యాలు, పరస్పర అనుసంధానానికి కొత్త కేంద్రంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.విశాఖపట్నంలో తమ తొలి హోటల్ ఏర్పాటు కావడం సంస్థకు ముఖ్యమైన అడుగని హిల్టన్ సౌత్ ఏషియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రీజినల్ హెడ్ జుబిన్ సక్సేనా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వాణిజ్య కేంద్రాల్లో ఒకటైన విశాఖపట్నంలో హిల్టన్ ఉనికి మరింత బలపడుతుందని ఆయన తెలిపారు. హాస్పిటాలిటీ రంగంలో విశాఖపట్నం దీర్ఘకాలికంగా మంచి అవకాశాలు ఉన్న నగరంగా తాము చూస్తున్నామని చెప్పారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో హిల్టన్ డెవలప్‌మెంట్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్లారెన్స్ టాన్ మాట్లాడుతూ, విశాఖపట్నం లాంటి ప్రాధాన్యం పెరుగుతున్న మార్కెట్లలో హోటళ్ల ఏర్పాటుతో కస్టమర్లకు మరిన్ని వసతి ఎంపికలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.ఇది కూడా చదవండి: Railway Rules: ట్రైన్ ఎక్కారా? రైల్వేలో ఈ రూల్స్ ఎక్కడా రాసి ఉండవు... కానీ ప్రతి ప్రయాణికుడూ తెలుసుకోవాల్సిందే!కపిల్ గ్రూప్‌కు చెందిన బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వడ్డనపు కృష్ణయ్య మాట్లాడుతూ, విశాఖపట్నంలో వేగంగా పెరుగుతున్న బిజినెస్ ఎకోసిస్టమ్‌కు అనుగుణంగా తమ ప్రణాళికలను అమలు చేయడానికి హిల్టన్ సరైన భాగస్వామి అని చెప్పారు. బిజినెస్ ట్రావెలర్స్‌తో పాటు లీజర్ ట్రావెలర్స్‌కు కూడా మంచి హాస్పిటాలిటీ అనుభవాన్ని అందించాలన్న తమ లక్ష్యానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ఒప్పందంతో భారత్‌లో హిల్టన్ అప్‌స్కేల్ హాస్పిటాలిటీ పోర్ట్‌ఫోలియో మరింత విస్తరించనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో హిల్టన్‌కు మరో రెండు ప్రాజెక్టులు పైప్‌లైన్‌లో ఉన్నాయి. తిరుపతి, మంత్రాలయంలో హిల్టన్ గార్డెన్ ఇన్ హోటళ్లు త్వరలో రానున్నాయి.మరింత చదవండి

Source link