ప్రభన్యూస్

వడ్డీ వ్యాపారుల వేధింపులు సహించేది లేదు.. సీఐ చరమంద రాజు హెచ్చరిక

హుజూర్‌నగర్, ప్రభ న్యూస్, నవంబర్ 23:

పట్టణంలో వడ్డీ వ్యాపారుల వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు హుజూర్‌నగర్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. డైలీ, వీక్లీ, మంత్లీ వడ్డీల పేరుతో అధిక వడ్డీలు వసూలు చేయడం, చక్రవడ్డీ విధిస్తూ అప్పు తీసుకున్న వారిని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడం, అప్పులు తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో బాధితులను బెదిరించడం, వేధింపులకు పాల్పడడం వంటి చర్యలను సహించేది లేదని సీఐ చరమంద రాజు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అప్పుల పేరుతో బెదిరింపులు, అవమానాలు, మానసిక వేధింపులకు గురవుతున్న బాధితులు భయపడకుండా ధైర్యంగా సమీప పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితుల ఫిర్యాదులపై విచారణ చేపట్టి, చట్టాన్ని ఉల్లంఘించిన వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ప్రజలు అక్రమ వడ్డీ వ్యాపారుల వేధింపులకు గురైతే పోలీసులకు సమాచారం అందించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 November 2026, 7:25 pm Digital Edition : Prabhanews
<b>వడ్డీ వ్యాపారుల వేధింపులు సహించేది లేదు.. సీఐ చరమంద రాజు హెచ్చరిక</b>