స్టాండ్అలోన్ ఇన్వెస్టర్లు ఉపయోగించే ఫామ్ ఐ-526 దరఖాస్తు ఫీజు ప్రస్తుతం 3,675 అమెరికన్ డాలర్లుగా ఉంది. ఇది ఇకపై 7,615 డాలర్లకు పెరుగుతుంది. అప్రూవ్ అయిన రీజినల్ సెంటర్ ద్వారా ఈబీ-5లో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లు ఉపయోగించే ప్రారంభ ఫామ్ ఐ-526ఈ పిటిషన్ ఫీజు కూడా 3,675 డాలర్ల నుంచి 7,850 డాలర్లకు పెరుగుతుంది. ప్రారంభ ఐ-526, ఐ-526ఈ పిటిషన్లకు 75 డాలర్ల టెక్నాలజీ ఫీజు కూడా అదనంగా ఉంటుంది. రీజినల్ సెంటర్ ద్వారా పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లు ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఇన్వెస్టర్ ఇంటెగ్రిటీ ఫీజును కూడా అదనంగా చెల్లించాలి. పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్‌పై ఉన్న షరతులను తొలగించేందుకు ఇన్వెస్టర్లు దాఖలు చేసే ఫామ్ ఐ-829 ఫీజు 3,750 డాలర్ల నుంచి 5,000 డాలర్లకు పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

