ది బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఎంఎస్ఎంఇలు, చిన్న వ్యాపారులు, చేనేత కార్మికులు, కళాకారులు తమ ఉత్పత్తులను మరింత వేగంగా ఫుల్‌ఫిల్ చేసేందుకు వీలుగా, ఇ-కార్ట్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లలో 2.5 కోట్లకు పైగా యూనిట్ల ఉత్పత్తులను ముందుగానే నిల్వ చేశారు. అలాగే, విక్రేతల ఫుల్‌ఫిల్‌మెంట్ సమయాన్ని తగ్గించేందుకు కీలకమైన సేలర్ హబ్‌లలో 70 అదనపు పికప్ స్టేషన్లను ప్రారంభించారు. పండుగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ మార్కెట్‌ప్లేస్‌కు వెలుపల ఉన్న విక్రేతలు, ఎంఎస్ఎంఇలు కూడా తమ వ్యాపారాన్ని విస్తరించుకుని దేశవ్యాప్తంగా కస్టమర్లకు ఉత్పత్తులను డెలివరీ చేసేలా, ఇ-కార్ట్ 3పిఎల్ ఫ్రాంచైజీల సంఖ్య ప్రారంభించిన రెండు నెలల్లోనే రెట్టింపై 600కు చేరింది.
ది బిగ్ బిలియన్ డేస్, పండుగ షాపింగ్‌ను దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు, ఇ-కార్ట్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ డెలివరీ పరిధిలోకి 750కు పైగా కొత్త పిన్‌కోడ్‌లను చేర్చారు. వీటిలో లడఖ్‌లోని లేహ్, జమ్మూకశ్మీర్‌లోని కార్గిల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో మిజోరంలోని కమలనగర్, జముయాంగ్, మేఘాలయలోని టురాసిటీ, రిసుబెల్‌పరా, రాజాబాలా, అరుణాచల్‌ప్రదేశ్‌లోని బొమ్డిలా, తేజు వంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి.
ది బిగ్ బిలియన్ డేస్‌ను విజయవంతం చేయడంలో విష్‌మాస్టర్లది కీలక పాత్ర. డెలివరీ సేవలకు మాత్రమే పరిమితం కాకుండా, వారి సంక్షేమం పట్ల ఫ్లిప్‌కార్ట్ తన బాధ్యతను మరింత విస్తరించింది. ప్రతి విష్‌మాస్టర్‌కు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, పర్సనల్ యాక్సిడెంట్ కవర్, మెడిక్లెయిమ్ ప్రయోజనాలు అందుతున్నాయి. ప్రతి పండుగ సీజన్‌లో ఈ బీమా కవరేజీ స్థాయిలను క్రమంగా పెంచుతూ వస్తోంది. అలాగే, విష్‌మాస్టర్లు, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడైనా వినియోగించుకునేలా డాక్టర్ ఆన్ కాల్ సేవను కూడా ఫ్లిప్‌కార్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆదాయ పరంగా, ఈ పండుగ సీజన్‌లో విష్‌మాస్టర్లకు జాయినింగ్, రిటెన్షన్ బోనస్‌లతో పాటు రిఫరల్ ఇన్సెంటివ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. తద్వారా ఏడాదిలో అత్యధిక డిమాండ్ ఉండే ఈ సమయంలో అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ పార్ట్ నర్స్ యాప్ ద్వారా ఏఐ ఆధారిత బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేపట్టడంతో, అవసరమైన తనిఖీలు, విధానాల్లో ఎలాంటి రాజీ లేకుండానే ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను 10 నిమిషాల్లోపు పూర్తి చేయవచ్చు. ప్రతి విష్‌మాస్టర్‌ను ఒకే ప్రమాణాలతో వెరిఫై చేస్తారు. తద్వారా వారు మరింత వేగంగా సంపాదన ప్రారంభించేందుకు ఈ సాంకేతికత దోహదపడుతుంది. ఇదే యాప్ శిక్షణా వేదికగానూ పనిచేస్తుంది. దీంతో కొత్తగా చేరే విష్‌మాస్టర్లు తమ మొదటి షిఫ్ట్‌కు ముందే డెలివరీ ప్రమాణాలు, విధానాలను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సప్లై చైన్ హెడ్ హేమంత్ బద్రీ మాట్లాడుతూ, “ప్రతి ఏడాది ది బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా కస్టమర్ల అంచనాలు మరింత పెరుగుతున్నాయి. వేగవంతమైన డెలివరీలు, విస్తృతమైన సేవల పరిధిని వారు ఆశిస్తున్నారు. ఈ ఏడాది లేహ్, కార్గిల్‌లోని కస్టమర్లు తొలిసారిగా బిగ్ బిలియన్ డేస్ అనుభవాన్ని పొందనున్నారు. ప్రస్తుతం ఇ-కార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ కలిసి 8,200కు పైగా సదుపాయాలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దీంతో మరింత మంది కస్టమర్లకు పండుగ షాపింగ్ అనుభవాన్ని అందించడంతో పాటు, గతంలో చేరుకోలేని కొనుగోలుదారులను కూడా విక్రేతలు చేరుకునేందుకు మేము సహాయపడుతున్నాం” అని అన్నారు.
పండుగ సీజన్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.5 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో దాదాపు 75,000 అవకాశాలు తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి ప్రవేశిస్తున్న వారికి అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా కల్పిస్తున్న ఉపాధి అవకాశాల్లో 60 శాతం చివరి దశ డెలివరీ సేవలకు సంబంధించినవే. ఇది మరింత వేగవంతమైన డెలివరీలపై, అలాగే టైర్-2, టైర్-3 మార్కెట్లలో ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ విస్తరణపై సంస్థ చూపిస్తున్న దృష్టిని ప్రతిబింబిస్తోంది.
