ప్రభన్యూస్

ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వాలు అండగా నిలవాలి!

జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు సమగ్ర విధానం.. పెండింగ్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి : టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణుగోపాల్
జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల సాధనకు దశలవారీ ఉద్యమం : జిల్లా అధ్యక్షుడు ఏనుగు వెంకటేశ్వరరావు

ఖమ్మం , ప్రభ న్యూస్, స్టేట్ బ్యూరో , అక్టోబరు 2 :

ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రాధాన్యతనివ్వాలని, వారి న్యాయమైన హక్కులను పరిరక్షిస్తూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణుగోపాల్ కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు అందించడంతో పాటు వారి వృత్తిపరమైన భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఆందోళనలో భాగంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం జెడ్పీ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద, జిల్లా పరిషత్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలుత అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి పాత కలెక్టరేట్ మీదుగా జిల్లా పరిషత్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తమ సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మైస పాపారావు అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో మాటేటి వేణుగోపాల్ మాట్లాడుతూ, ప్రజల కష్టాలు, కన్నీళ్లు, సమస్యలను నిరంతరం సమాజం ముందుకు తీసుకొస్తూ, ప్రభుత్వాల దృష్టికి చేర్చడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతాయుతమైన పాత్ర నిర్వహిస్తున్న జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సమయంలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై తక్షణమే దృష్టి సారించాలని కోరారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు అందించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు.

జిల్లా అధ్యక్షుడు ఏనుగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమమే లక్ష్యంగా యూనియన్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం దశలవారీగా ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు కల్పించే దిశగా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం త్వరలో జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులతో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు నలజాల వెంకటరావు, జిల్లా మాజీ అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, కార్యదర్శులు మామిడాల భూపాల్, పసునూరి మహేందర్, జిల్లా హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు, జిల్లా యూనియన్ కోశాధికారి నాగండ్ల శివానంద, ఖమ్మం నగర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు చెరుకుపల్లి శ్రీనివాసరావు, నంచర్ల జనార్ధన చారి, కోశాధికారి ఏలూరు వేణుగోపాలరావు, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నామ పురుషోత్తం, కార్యదర్శి శీలం శ్రీనివాస్, కోశాధికారి పిన్ని సత్యనారాయణ, కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు ఆలస్యం అప్పారావు, ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షులు కమటం శ్రీనివాస్ తదితరులు పాల్గొని జర్నలిస్టుల సమస్యలను ప్రస్తావిస్తూ, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.అనంతరం ఖమ్మం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ను కలిసి జర్నలిస్టుల సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు మొయినుద్దీన్, పసుపులేటి సత్యనారాయణ, వేగినాటి మాధవరావు, మేడి రమేష్, గోసుల నాగేశ్వరరావు, ఈనాడు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, లాలా సాహెబ్, శేషిరెడ్డి, గమనిక రాజ్‌కుమార్, పోటు శ్రీనివాస్, మహంకాళి వెంకట శ్రీనివాసరావు, రజనీకుమార్ రెడ్డి, నన్నక అప్పారావు, సాక్షి ఉపేందర్, రామారావు, మల్లికార్జున్, ప్రజాపక్షం ప్రసాద్, వినాయకరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 October 2026, 6:55 pm Digital Edition : Prabhanews
<b>ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వాలు అండగా నిలవాలి</b>!