డెబ్యూ ప్రొడక్షన్ హౌస్‌లు స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ మిస్టిరీయస్ ఇన్వెస్టిగేషన్ డ్రామా థ్రిల్లర్ ను కనకరావు తొనంగి, అభిషేక్ కె, ప్రముఖ ఎడిటర్ గ్యారీ BH నిర్మిస్తున్నారు. సాయి బాలి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ
దర్శకుడు సాయి బాలి మాట్లాడుతూ ” అందరి సపొర్ట్‌తో బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చానని నమ్ముతున్నాను , టైటిల్ చుట్టు ఉన్న అమ్మాయి.. అదృశ్యం.. అన్వేషణ, అనుమానం.. అసాంఘీకం… అమానుషం ఈ పదాల మధ్యే ఈ కథ మొత్తం ఉంది. రాహుల్ విజయ్ను ఓ సీన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా ఈ సినిమాలో కనిపిస్తాడు. ఇన్వెస్టిగేషన్ డ్రామాలో ఆయన కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది. నవంబరు 12న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది ‘ అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ ” విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే విధంగా రూపొందిన చిత్రమిది. రాహుల్ విజయ్ కెరీర్లో ఈ సినిమా మైల్ స్టోన్‌గా నిలుస్తుంది. ఈ సినిమా నవంబరు 12న ఫర్ఫెక్ట్ ప్లాన్‌తో విడుదల కాబోతుంది.’ అ’ మిస్టిరీయస్ ఇంట్రెస్టింగ్ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్‌గా మీ అందరికి థ్రిల్ల్‌ను పంచబోతుంది ‘ అన్నారు.
మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అభినవ్ వి. కునపరెడ్డి, గ్యారీ BH ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మిస్టరీ, ఎమోషన్, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో కూడిన డార్క్ థ్రిల్లర్‌గా ‘AH’ తెరకెక్కుతున్నట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. అక్టోబర్ 30న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచబోతుంది.
నటీనటులు: రాహుల్ విజయ్, అర్చన అయ్యర్, జాన్ విజయ్, సుధర్శన్, మిర్చి కిరణ్, బిత్తిరి సత్తి, దయానంద్ రెడ్డి.
సాంకేతిక బృందం:
దర్శకుడు: సాయి బాలి
నిర్మాతలు: కనకరావు తొనంగి, అభిషేక్, గ్యారీ BH
బ్యానర్లు: స్టార్ బాక్స్ స్టోరీస్, రిప్పుల్ స్లైడ్ స్టూడియోస్
కో-ప్రొడ్యూసర్: అభినవ్ వి. కునపరెడ్డి
సంగీత దర్శకుడు: శ్రీచరణ్ పాకాల
డీఓపీ: మోనిష్ భూపతి రాజు
ఎడిటర్లు: అభినవ్ వి. కునపరెడ్డి, గ్యారీ BH
డీఐ: సారథి స్టూడియోస్
వీఎఫ్ఎక్స్: జాయింట్ ఫ్యామిలీ ఫిల్మ్స్
పీఆర్వో: మడూరి మధు – ధీరజ్ -ప్రసాద్
డిజిటల్ మీడియా: విష్ణు తేజ్ పుట్టా
