Last Updated:
భారతదేశపు నంబర్ 1 SUV నెక్సాన్‌కు సరికొత్త రూపం ‘నెక్సాన్ కామో’ను ఆవిష్కరించింది టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్. ప్రత్యేకమైన ‘మున్నార్ మిస్ట్’, ‘కూర్గ్ క్లౌడ్’ రంగుల్లో అందుబాటులో ఉంది. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ పవర్ట్రెయిన్లలో విస్తృత ఫీచర్లతో అందుబాటులో ఉంది.
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV), నేడు ‘నెక్సాన్ కామో’ను రూ. 9.99 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)తో ఆవిష్కరించింది. ప్రత్యేకమైన ‘మున్నార్ మిస్ట్’, ‘కూర్గ్ క్లౌడ్’ అనే రెండు ప్రీమియం రంగుల్లో అందుబాటులో ఉన్న నెక్సాన్ కామో, ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు అత్యాధునిక సాంకేతికతను సమన్వయం చేసిన ప్రత్యేక ప్యాకేజీని అందిస్తుంది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ లెదరెట్ సీట్లు, JBL ఆడియో సిస్టమ్ వంటి ప్రీమియం సౌకర్యం, భద్రత, స్మార్ట్ టెక్నాలజీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. పెట్రోల్, డీజిల్, iCNG పవర్ట్రెయిన్లలో, పలు ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉన్న నెక్సాన్ కామో, ప్రతి తరహా ఎస్‌యూవీ వినియోగదారునికి విలక్షణమైన యాజమాన్య అనుభవాన్ని అందిస్తుంది.

