Last Updated:
పట్టు వస్త్రాలు, మంగళ వాయిద్యాలు, భారీ ఊరేగింపు.. ఈ చెట్ల పెళ్లి చూస్తే నిజమైన పెళ్లిళ్లు కూడా సరిపోవు!
ప్రకృతిని దైవంగా భావించి పూజించడం భారతీయ సనాతన ధర్మంలో అనాదిగా వస్తున్న ఆచారం. చెట్లలో దేవతలు కొలువై ఉంటారని విశ్వసించే భక్తులు, వాటికి ఎంతో భక్తిశ్రద్ధలతో కళ్యాణం జరిపిస్తుంటారు. సరిగ్గా ఇలాంటి అరుదైన, కన్నుల పండువైన ఘట్టమే పుదుక్కోట్టై జిల్లా అరంత్తంగి సమీపంలోని మేల్మంగళం సౌత్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక సెల్వ వినాయగర్ ఆలయ ప్రాంగణంలో రావి, వేప చెట్లకు గ్రామస్తులు అత్యంత వైభవంగా సంప్రదాయబద్ధమైన వివాహ మహోత్సవం జరిపించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ అపురూప దైవిక వేడుకను కనులారా వీక్షించి భక్తి పారవశ్యంలో తేలియాడారు.
