ప్రభన్యూస్

గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా భారీ పేలుడు.. ఐదుగురు వలస కార్మికులకు తీవ్ర గాయాలు..! | తెలంగాణ వార్తలు


Last Updated:

మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండల కేంద్రం పరికిబండ గ్రామంలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది.

News18
News18

మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండల కేంద్రం పరికిబండ గ్రామంలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌లోకి గ్యాస్ నింపుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఐదుగురు వలస కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు గదిలో ఉన్న వస్తువులన్నీ పూర్తిగా దగ్ధమవగా, చుట్టుపక్కల ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో బీహార్‌కు చెందిన రాజేష్, గంగారాం, సంజీవ్, లాలాన్, దబల్ నాథ్ అనే ఐదుగురు కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే వారిని బయటకు తీసి చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో వారి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.

పేలుడు సంభవించిన వెంటనే అక్కడ ఉన్నవారు వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలిందని చెప్పి ఘటనను సాధారణ ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే బుధవారం ఉదయం ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సమగ్రంగా పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డొమెస్టిక్ సిలిండర్ల నుంచి కమర్షియల్ సిలిండర్లలోకి అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న సమయంలోనే పేలుడు సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

పోలీసుల విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. స్థానికంగా అద్దెకు తీసుకున్న ఓ ఇంటిలో గత ఏడాది కాలంగా అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ వ్యాపారం కొనసాగుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా అత్యంత ప్రమాదకరంగా గ్యాస్ బదిలీ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందా వెనుక ఉన్న నిర్వాహకులు ఎవరనే దానిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా, గ్యాస్ సరఫరా ఎలా జరుగుతోంది, ఎవరికి విక్రయిస్తున్నారు అనే కోణాల్లో కూడా విచారణ కొనసాగుతోంది. అలాగే పేలుడు జరిగిన ఇంటిని పరిశీలించి ఆధారాలను సేకరిస్తున్నారు.

ఈ ఘటన మరోసారి అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ ఎంత ప్రమాదకరమో స్పష్టం చేసింది. సరైన భద్రతా చర్యలు లేకుండా డొమెస్టిక్ సిలిండర్ల నుంచి కమర్షియల్ సిలిండర్లలోకి గ్యాస్ నింపడం చట్టవిరుద్ధమే కాకుండా ప్రాణాంతకమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 2:09 pm Digital Edition : Prabhanews
గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా భారీ పేలుడు.. ఐదుగురు వలస కార్మికులకు తీవ్ర గాయాలు..! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 15, 2026 3:06 PM ISTమెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండల కేంద్రం పరికిబండ గ్రామంలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది.News18మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండల కేంద్రం పరికిబండ గ్రామంలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌లోకి గ్యాస్ నింపుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఐదుగురు వలస కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు గదిలో ఉన్న వస్తువులన్నీ పూర్తిగా దగ్ధమవగా, చుట్టుపక్కల ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో బీహార్‌కు చెందిన రాజేష్, గంగారాం, సంజీవ్, లాలాన్, దబల్ నాథ్ అనే ఐదుగురు కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే వారిని బయటకు తీసి చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో వారి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.పేలుడు సంభవించిన వెంటనే అక్కడ ఉన్నవారు వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలిందని చెప్పి ఘటనను సాధారణ ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే బుధవారం ఉదయం ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సమగ్రంగా పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డొమెస్టిక్ సిలిండర్ల నుంచి కమర్షియల్ సిలిండర్లలోకి అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న సమయంలోనే పేలుడు సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.పోలీసుల విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. స్థానికంగా అద్దెకు తీసుకున్న ఓ ఇంటిలో గత ఏడాది కాలంగా అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ వ్యాపారం కొనసాగుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా అత్యంత ప్రమాదకరంగా గ్యాస్ బదిలీ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందా వెనుక ఉన్న నిర్వాహకులు ఎవరనే దానిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా, గ్యాస్ సరఫరా ఎలా జరుగుతోంది, ఎవరికి విక్రయిస్తున్నారు అనే కోణాల్లో కూడా విచారణ కొనసాగుతోంది. అలాగే పేలుడు జరిగిన ఇంటిని పరిశీలించి ఆధారాలను సేకరిస్తున్నారు.ఈ ఘటన మరోసారి అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ ఎంత ప్రమాదకరమో స్పష్టం చేసింది. సరైన భద్రతా చర్యలు లేకుండా డొమెస్టిక్ సిలిండర్ల నుంచి కమర్షియల్ సిలిండర్లలోకి గ్యాస్ నింపడం చట్టవిరుద్ధమే కాకుండా ప్రాణాంతకమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link