మీరు కొత్త ఫోన్ కొన్నారా? పాత మొబైల్లోని వాట్సాప్ చాట్స్, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు పోతాయేమో అన్న టెన్షన్ అవసరం లేదు. ఆండ్రాయిడ్ నుంచి ఆండ్రాయిడ్‌కు, ఐఫోన్ నుంచి ఐఫోన్‌కు మారేటప్పుడు వాట్సాప్‌లో ఉన్న చాట్ ట్రాన్స్ఫర్ ఫీచర్‌తో మీ పూర్తి చాట్, మీడియా హిస్టరీని కొత్త ఫోన్‌కు సులభంగా మార్చుకోవచ్చు. బ్యాకప్ ద్వారా చాట్ డేటాను తిరిగి పొందొచ్చు. కానీ చాట్ ట్రాన్స్ఫర్ ఫీచర్ మీ అకౌంట్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కొత్త ఫోన్‌కు తీసుకెళ్తుంది. ఇందులో వ్యక్తిగత మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు తదితరాలు ఉంటాయి. అయితే పీర్-టు-పీర్ పేమెంట్ మెసేజ్‌లు, వాట్సాప్ ఛానల్స్ ద్వారా వచ్చిన మీడియాను ట్రాన్స్ఫర్ చేయలేరు. (ప్రతీకాత్మక చిత్రం)

