Last Updated:
అడోబ్ కొత్త సీఈఓగా అనిల్ చక్రవర్తి నియమితులయ్యారు. డిసెంబర్ 1 నుంచి బాధ్యతలు చేపడతారు. శంతను నారాయణ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌గా మారతారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీగా ఉన్న అడోబ్‌లో కీలక మార్పు జరిగింది. 18 ఏళ్లకు పైగా కంపెనీకి నాయకత్వం వహించిన శంతను నారాయణ్ స్థానంలో అనిల్ చక్రవర్తిని కొత్త ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా అడోబ్ నియమించింది. అమెరికాకు చెందిన మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ అడోబ్ గురువారం ఈ విషయాన్ని ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి అనిల్ చక్రవర్తి కొత్త బాధ్యతలు చేపడతారు. శంతను నారాయణ్ ఎగ్జిక్యూటివ్ చైర్ పదవికి మారతారు. బనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన అనిల్ చక్రవర్తి ప్రస్తుతం అడోబ్‌లో కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆర్కెస్ట్రేషన్ బిజినెస్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ ఫీల్డ్ ఆపరేషన్స్‌ను కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. “ఏఐ ఆధారిత కాలంలో అడోబ్ వృద్ధికి నాయకత్వం వహించడానికి అనిల్ సరైన వ్యక్తి అనే విషయంలో నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎగ్జిక్యూటివ్ చైర్‌గా నా కొత్త పాత్రలో ఆయనతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను” అని శంతను నారాయణ్ ఒక ప్రకటనలో చెప్పారు.

