Last Updated:
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు అమ్మగా ప్రమోషన్ పొందడంతో సినీ వర్గాల్లో పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఆమెకు కొడుకే పుడతాడని 12 ఏళ్ల క్రితమే ఓ జ్యోతిష్యుడు చెప్పాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు అమ్మగా ప్రమోషన్ పొందడంతో సినీ వర్గాల్లో, అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. గతేడాది డిసెంబర్‌లో ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సమంత, నవంబర్ 19న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. శుక్రవారం (నవంబర్ 20) సోషల్ మీడియా వేదికగా తమ బుజ్జాయిని పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. తమ కొడుకుకు ‘దేవ్’ అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. దీంతో ఈ కొత్త తల్లిదండ్రులకు సినీ ప్రముఖులు, నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా, సమంతకు మగబిడ్డే పుడతాడని సుమారు 12 ఏళ్ల క్రితమే ఓ జ్యోతిషుడు అంచనా వేశాడన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అందుకు సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 2010లో ‘ఏ మాయ చేశావె’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సమంత.. అనతికాలంలోనే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాగ చైతన్య వంటి అగ్ర హీరోలందరితో నటించి స్టార్‌డమ్ అందుకున్నారు. ఈ క్రమంలోనే 2014లో యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన పాపులర్ టాక్ షో ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా’ కార్యక్రమానికి ఆమె అతిథిగా హాజరయ్యారు.
An astrologer’s prediction came true! Samantha blessed with a baby boy! 👶💙✨ Congratulations 🎉
#KonchemTouchLoUnteCheptha
#ZeeTeluguSpotlight #ZeeTelugu https://t.co/sHZ2USDSBd— ZEE TELUGU (@ZeeTVTelugu) November 20, 2026
ఆ షోలో భాగంగా ఓ సాముద్రికుడు (ముఖం చూసి జాతకం చెప్పే వ్యక్తి) సమంత భవిష్యత్తు గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సమంతకు మొదటి సంతానంగా మగబిడ్డే పుడతాడని ఆయన స్పష్టంగా చెప్పారు. అయితే ఆ మాట విన్న సమంత మాత్రం తనకు ఆడపిల్లే కావాలని సరదాగా కోరారు. “నా ముఖాన్ని మరోసారి సరిగ్గా చూసి అమ్మాయి పుడుతుందని చెప్పండి” అంటూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో జ్యోతిషుడిని అడిగారు. కానీ, ఆయన చెప్పినట్లే సరిగ్గా 12 ఏళ్ల తర్వాత సమంతకు తొలి సంతానంగా మగబిడ్డే జన్మించాడు. దీంతో ఆ త్రోబ్యాక్ వీడియోను అభిమానులు ఇప్పుడు తెగ షేర్ చేస్తున్నారు.
కాగా, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ కోసం కలిసి పనిచేసిన సమంత, రాజ్ నిడిమోరుల మధ్య షూటింగ్ సమయంలోనే ప్రేమ చిగురించింది. గతేడాది వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట ఇప్పుడు తల్లిదండ్రులుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం సూపర్ హిట్ సాధించింది. ప్రస్తుతం సమంత రెస్ట్ మోడ్ లో ఉంది.

