Vijay Deverakonda: రణబాలిపై సందీప్ రెడ్డి వంగా రివ్యూ.. ఒక్క మాటలో తేల్చేశాడుగా..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘రణబాలి’ థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాబడుతోంది. ఈ క్రమంలో తాజాగా సందీప్ రెడ్డి వంగా రియాక్ట్ అయ్యారు.

News18
News18

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా పీరియాడిక్ వార్ డ్రామా ‘రణబాలి’ థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాబడుతోంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తున్న తరుణంలో, ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను వీక్షించి తనదైన శైలిలో అద్భుతమైన రివ్యూ ఇచ్చారు. ‘రణబాలి’ భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప చిత్రమని ఆయన కితాబిచ్చారు.

సందీప్ వంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘‘హీరో పాత్రలో విజయ్ దేవరకొండ నటన అద్భుతం. రణబాలి పాత్రలో తను పూర్తిగా ఒదిగిపోయిన తీరు, ఆ ఇంటెన్సిటీ అమోఘం. ఇక విజయ్, రష్మిక జోడీ విషయానికొస్తే.. వారిద్దరి మధ్య ఉన్నది సాధారణ కెమిస్ట్రీకి మించిన బంధం. కొన్ని అనుబంధాలు తెరను దాటిపోతాయి. జయమ్మ అనే బలమైన పాత్రకు రష్మిక తన నటనతో ప్రాణం పోసింది’’ అని కొనియాడారు. గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత ఈ హిట్ పెయిర్ మరోసారి మ్యాజిక్ చేసిందని ఈ పోస్ట్ ద్వారా స్పష్టమవుతోంది. దీనికి తోడు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, గూస్‌బంప్స్ తెప్పించే నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని వంగా పేర్కొన్నారు.

‘‘చరిత్రను లోతుగా అధ్యయనం చేసిన తీరు, దానిని వెండితెరపై ఆవిష్కరించిన విధానంలో దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ శ్రద్ధ ప్రతి ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. చరిత్రలో మరుగున పడిపోయిన ఒక గొప్ప ఘట్టాన్ని ఈ సినిమాతో మన కళ్ల ముందుకు తీసుకొచ్చారు. నిజానికి ఇది మన పాఠ్యపుస్తకాల్లో చేర్చదగినంత గొప్ప కథ’’ అని తెలుపుతూ రాహుల్ సంకృత్యాన్ విజన్‌ను ఆకాశానికెత్తారు. ‘టాక్సీవాలా’ తర్వాత విజయ్, రాహుల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం వారి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది.

సందీప్ రెడ్డి వంగా చేసిన ఈ పోస్ట్‌పై విజయ్ దేవరకొండ ఎమోషనల్‌గా స్పందించారు. ‘‘వంగా.. మీరు మా సినిమా చూడడం, ఇంత గొప్ప రివ్యూ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. మన కాంబినేషన్‌లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ ప్రీమియర్స్ పడిన తర్వాత మీరు నన్ను ఎంతో ఆప్యాయంగా హత్తుకుని ప్రశంసించిన ఆ మధురమైన క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయి. మరో 10 సంవత్సరాల తర్వాత చూసినా మీకు ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుందని నాకు తెలుసు’’ అని విజయ్ బదులిచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 October 2026, 2:38 pm Digital Edition : Prabhanews
Vijay Deverakonda: రణబాలిపై సందీప్ రెడ్డి వంగా రివ్యూ.. ఒక్క మాటలో తేల్చేశాడుగా..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 17, 2026 2:31 PM ISTవిజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘రణబాలి’ థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాబడుతోంది. ఈ క్రమంలో తాజాగా సందీప్ రెడ్డి వంగా రియాక్ట్ అయ్యారు. News18టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా పీరియాడిక్ వార్ డ్రామా ‘రణబాలి’ థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాబడుతోంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తున్న తరుణంలో, ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను వీక్షించి తనదైన శైలిలో అద్భుతమైన రివ్యూ ఇచ్చారు. 'రణబాలి' భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప చిత్రమని ఆయన కితాబిచ్చారు.సందీప్ వంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘‘హీరో పాత్రలో విజయ్ దేవరకొండ నటన అద్భుతం. రణబాలి పాత్రలో తను పూర్తిగా ఒదిగిపోయిన తీరు, ఆ ఇంటెన్సిటీ అమోఘం. ఇక విజయ్, రష్మిక జోడీ విషయానికొస్తే.. వారిద్దరి మధ్య ఉన్నది సాధారణ కెమిస్ట్రీకి మించిన బంధం. కొన్ని అనుబంధాలు తెరను దాటిపోతాయి. జయమ్మ అనే బలమైన పాత్రకు రష్మిక తన నటనతో ప్రాణం పోసింది’’ అని కొనియాడారు. గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత ఈ హిట్ పెయిర్ మరోసారి మ్యాజిక్ చేసిందని ఈ పోస్ట్ ద్వారా స్పష్టమవుతోంది. దీనికి తోడు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, గూస్‌బంప్స్ తెప్పించే నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని వంగా పేర్కొన్నారు.‘‘చరిత్రను లోతుగా అధ్యయనం చేసిన తీరు, దానిని వెండితెరపై ఆవిష్కరించిన విధానంలో దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ శ్రద్ధ ప్రతి ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. చరిత్రలో మరుగున పడిపోయిన ఒక గొప్ప ఘట్టాన్ని ఈ సినిమాతో మన కళ్ల ముందుకు తీసుకొచ్చారు. నిజానికి ఇది మన పాఠ్యపుస్తకాల్లో చేర్చదగినంత గొప్ప కథ’’ అని తెలుపుతూ రాహుల్ సంకృత్యాన్ విజన్‌ను ఆకాశానికెత్తారు. 'టాక్సీవాలా' తర్వాత విజయ్, రాహుల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం వారి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది.సందీప్ రెడ్డి వంగా చేసిన ఈ పోస్ట్‌పై విజయ్ దేవరకొండ ఎమోషనల్‌గా స్పందించారు. ‘‘వంగా.. మీరు మా సినిమా చూడడం, ఇంత గొప్ప రివ్యూ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. మన కాంబినేషన్‌లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ ప్రీమియర్స్ పడిన తర్వాత మీరు నన్ను ఎంతో ఆప్యాయంగా హత్తుకుని ప్రశంసించిన ఆ మధురమైన క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయి. మరో 10 సంవత్సరాల తర్వాత చూసినా మీకు ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుందని నాకు తెలుసు’’ అని విజయ్ బదులిచ్చారు.మరింత చదవండి

Source link