హైదరాబాద్లోని సుప్రసిద్ధ బాలాపూర్ గణనాథుడిని టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ దర్శించుకున్నారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపానికి విచ్చేసిన ఆయన, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. విజయ్ దేవరకొండ రాకతో బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో అభిమానుల సందడి నెలకొంది. ఉత్సవ సమితి నిర్వాహకులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి ప్రసాదం అందించారు.
Source link
