Vijay Deverakonda: ఈ ఒక్క మీటింగ్‌తోనే విజయ్ నా ఫేవరేట్ అయ్యారు.. ఆయన రిసీవింగ్ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

టాలీవుడ్ స్టార్ దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు దళపతి విజయ్‌తో సమావేశమయ్యారు. తాజాగా ఈ మీటింగ్ పై అటు విజయ్ దేవరకొండ, ఇటు రష్మిక మందన్న ఇద్దరూ రియాక్ట్ అయ్యారు.

News18
News18

టాలీవుడ్ స్టార్ దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు దళపతి విజయ్‌తో సోమవారం చెన్నైలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. తమ తాజా చిత్రం ‘రణబలి’ అక్టోబర్ 16న విడుదల కానున్న నేపథ్యంలో, ప్రమోషన్స్ కోసం చెన్నై వెళ్లిన ఈ జంట సీఎం విజయ్‌ను స్వయంగా కలిసి ముచ్చటించారు. ఈ ఆత్మీయ కలయికకు సంబంధించిన ఫొటోలను విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకోగా.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

ఆ ఫొటోలలో సీఎం విజయ్‌తో కలిసి విజయ్ దేవరకొండ, రష్మిక ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ పోజులిచ్చారు. మరో ఫొటోలో ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించగా.. ఇంకో ఫొటోలో దేవరకొండ, ముఖ్యమంత్రి విజయ్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ ప్రత్యేకమైన భేటీ గురించి విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకుంటూ భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. “ప్రియమైన దళపతి విజయ్ సార్‌తో ఎంతో అద్భుతమైన సమయాన్ని గడిపాను. రోజంతా పరిపాలనా కార్యక్రమాలతో ఆయన ఎంతో అలసిపోయి ఉన్నప్పటికీ, మమ్మల్ని అత్యంత ప్రేమతో ఆహ్వానించారు. జీవితం, పని, ప్రపంచ పరిణామాల గురించి ఎన్నో వ్యక్తిగత విషయాలను మాతో పంచుకున్నారు. కేవలం ఈ ఒక్క మీటింగ్‌తోనే సార్ నా ఫేవరెట్ అయిపోయారు. మళ్లీ కలిసే వరకు నా ప్రేమ, అపారమైన గౌరవం మీకు ఎప్పటికీ ఉంటాయి” అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.

హీరోయిన్ రష్మిక మందన్న కూడా ఈ సమావేశంపై స్పందిస్తూ ముఖ్యమంత్రి విజయ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. “చాలా కాలం తర్వాత దళపతి విజయ్ సార్‌ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పటినుంచో ఆయనకు వీరాభిమానిగా ఉన్న నాకు, ‘వారసుడు’ (2023) సినిమాలో ఆయనతో కలిసి నటించే అదృష్టం దక్కింది. సినిమా రంగంలో సూపర్ స్టార్‌గా రాణించిన ఆయన.. నేడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండటం చూసి నేను మరింతగా ఆరాధిస్తున్నాను. ఆయన ప్రయాణం నిజంగా నమ్మశక్యం కానిది. మీకు నా ప్రేమ, బెస్ట్ విషెస్ ఎల్లప్పుడూ ఉంటాయి సార్!” అని రష్మిక రాసుకొచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 October 2026, 8:25 am Digital Edition : Prabhanews
Vijay Deverakonda: ఈ ఒక్క మీటింగ్‌తోనే విజయ్ నా ఫేవరేట్ అయ్యారు.. ఆయన రిసీవింగ్ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 13, 2026 8:16 AM ISTటాలీవుడ్ స్టార్ దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు దళపతి విజయ్‌తో సమావేశమయ్యారు. తాజాగా ఈ మీటింగ్ పై అటు విజయ్ దేవరకొండ, ఇటు రష్మిక మందన్న ఇద్దరూ రియాక్ట్ అయ్యారు.News18టాలీవుడ్ స్టార్ దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు దళపతి విజయ్‌తో సోమవారం చెన్నైలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. తమ తాజా చిత్రం 'రణబలి' అక్టోబర్ 16న విడుదల కానున్న నేపథ్యంలో, ప్రమోషన్స్ కోసం చెన్నై వెళ్లిన ఈ జంట సీఎం విజయ్‌ను స్వయంగా కలిసి ముచ్చటించారు. ఈ ఆత్మీయ కలయికకు సంబంధించిన ఫొటోలను విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకోగా.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.ఆ ఫొటోలలో సీఎం విజయ్‌తో కలిసి విజయ్ దేవరకొండ, రష్మిక ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ పోజులిచ్చారు. మరో ఫొటోలో ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించగా.. ఇంకో ఫొటోలో దేవరకొండ, ముఖ్యమంత్రి విజయ్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.ఈ ప్రత్యేకమైన భేటీ గురించి విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకుంటూ భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. "ప్రియమైన దళపతి విజయ్ సార్‌తో ఎంతో అద్భుతమైన సమయాన్ని గడిపాను. రోజంతా పరిపాలనా కార్యక్రమాలతో ఆయన ఎంతో అలసిపోయి ఉన్నప్పటికీ, మమ్మల్ని అత్యంత ప్రేమతో ఆహ్వానించారు. జీవితం, పని, ప్రపంచ పరిణామాల గురించి ఎన్నో వ్యక్తిగత విషయాలను మాతో పంచుకున్నారు. కేవలం ఈ ఒక్క మీటింగ్‌తోనే సార్ నా ఫేవరెట్ అయిపోయారు. మళ్లీ కలిసే వరకు నా ప్రేమ, అపారమైన గౌరవం మీకు ఎప్పటికీ ఉంటాయి" అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.
Had the most beautiful time with the dearest Thalapathy @actorvijay Sir.
Even after a long day he received us with so much love and shared such personal insights into life, work and the world.One meeting and sir is already a favourite ❤️Until next time,
My love and respect.
Vijay Deverakonda :)— Vijay Deverakonda (@TheDeverakonda) October 12, 2026
After such a long time went to meet @actorvijay sir. ❤️😁
From fangirling him for longer than I can remember to having the opportunity to work with sir to today admiring him for the Chief Minister he is!
His journey is nothing short of incredible! 🔥❤️Biggest love and best wishes to you always sir! ❤️❤️— Rashmika Mandanna (@iamRashmika) October 12, 2026హీరోయిన్ రష్మిక మందన్న కూడా ఈ సమావేశంపై స్పందిస్తూ ముఖ్యమంత్రి విజయ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. "చాలా కాలం తర్వాత దళపతి విజయ్ సార్‌ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పటినుంచో ఆయనకు వీరాభిమానిగా ఉన్న నాకు, 'వారసుడు' (2023) సినిమాలో ఆయనతో కలిసి నటించే అదృష్టం దక్కింది. సినిమా రంగంలో సూపర్ స్టార్‌గా రాణించిన ఆయన.. నేడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండటం చూసి నేను మరింతగా ఆరాధిస్తున్నాను. ఆయన ప్రయాణం నిజంగా నమ్మశక్యం కానిది. మీకు నా ప్రేమ, బెస్ట్ విషెస్ ఎల్లప్పుడూ ఉంటాయి సార్!" అని రష్మిక రాసుకొచ్చారు.మరింత చదవండి

Source link