Last Updated:
టీవీలో కార్యక్రమం కంటే ప్రకటనలు ఎక్కువగా వస్తున్నాయనే ఫిర్యాదుల మధ్య కీలక మార్పు చోటుచేసుకుంది. ఇక టీవీ ఛానళ్లలో ప్రకటనల విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.
టెలివిజన్ ఛానళ్లలో ప్రకటనల ప్రసారానికి సంబంధించి ఇప్పటివరకు అమల్లో ఉన్న కీలక నిబంధనలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) రద్దు చేసింది. గురువారం ఈ మేరకు ప్రకటన చేసిన ట్రాయ్.. 2012లో తీసుకొచ్చిన ప్రకటనల వ్యవధికి సంబంధించిన నిబంధనలను పూర్తిగా తొలగించింది. గత నెలలో కేంద్ర ప్రభుత్వం టీవీ ఛానళ్లకు గంటకు 12 నిమిషాల ప్రకటనల పరిమితిని తొలగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.

