అయితే, ఈ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన నిబంధనలు రైల్వే శాఖతో ఒప్పందం చేసుకున్న ఇన్సూరెన్స్ కంపెనీలను బట్టి ఉంటాయి. ముఖ్యంగా, ఒక పీఎన్‌ఆర్ నంబర్‌పై ఉన్న ప్రయాణికులకు ఇన్సూరెన్స్ తీసుకుంటే, ఆ పీఎన్‌ఆర్‌లో ఉన్న ప్రయాణికులందరికీ ఈ బీమా వర్తిస్తుంది. ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ప్రయాణికుడికి, పాలసీని జారీ చేసే సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్య ఉండే ఒప్పందం. రైలు బయలుదేరే స్టేషన్ నుంచి ప్రయాణం మొదలైనప్పటి నుంచి గమ్యస్థాన స్టేషన్‌కు చేరుకునే వరకు ఈ పాలసీ రక్షణ కల్పిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)

