ప్రభన్యూస్

Tanushree Dutta: ఈవిల్ డెడ్.. నానా పటేకర్ మృతిపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ మృతిపై బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారంగా మారాయి. వివరాల్లోకి పోతే..

News18
News18

బాలీవుడ్ విలక్షణ నటుడు, సీనియర్ హీరో నానా పటేకర్ (75) మంగళవారం (అక్టోబర్ 8) తెల్లవారు జామున గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుతో కన్నుమూశారు. గుండెపోటు వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. క్రాంతివీర్, పరిందా, అబ్ తక్ ఛప్పన్, వెల్‌కమ్ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో తనదైన డైలాగ్ డెలివరీ, అద్భుతమైన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నానా పటేకర్ మరణవార్తతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. బాలీవుడ్, మరాఠీ సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. కేవలం నటుడిగానే కాకుండా ‘నామ్ ఫౌండేషన్’ ద్వారా ఎంతో మంది రైతులను ఆదుకున్న గొప్ప సామాజిక సేవకుడిగా ఆయనకు పేరుంది.

అయితే, మొత్తం దేశం ఆయన మృతికి సంతాపం తెలుపుతున్న వేళ, బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారంగా మారాయి. నానా పటేకర్ మృతి గురించి నేరుగా ఆయన పేరు ప్రస్తావించకుండా తనుశ్రీ దత్తా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. “ఈ వార్త విన్న వెంటనే ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు. ప్రస్తుతం నేను లక్నోలో జరగబోయే ఒక ముఖ్యమైన ఈవెంట్‌కి వెళ్తున్నాను. నా దృష్టంతా దానిపైనే ఉంది. నేను రెడీ అవుతున్న సమయంలో ఈ వార్త రావడం నాకు చాలా విచిత్రంగా అనిపించింది” అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ వార్త కారణంగా మీడియా మొత్తం తన కార్యక్రమాన్ని పక్కనపెట్టి అటువైపు దృష్టి మళ్లిస్తుందేమోనని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ వీడియోలో ఆమె ‘ఈవిల్ డెడ్’ (Evil Dead) అనే పదాన్ని ఉపయోగించడం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, మానవతా దృక్పథంతో ఆయన కుటుంబానికి మాత్రం తన సానుభూతిని తెలియజేశారు.

వీరిద్దరి మధ్య ఉన్న పాత వివాదమే తనుశ్రీ దత్తా ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 2018లో బాలీవుడ్‌ను కుదిపేసిన ‘మీటూ’ (#MeToo) ఉద్యమానికి ఆజ్యం పోసింది తనుశ్రీ దత్తానే. 2008లో వచ్చిన ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్‌లో ఒక పాట చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తన పట్ల లైంగికంగా, అనుచితంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. తనకు ఏమాత్రం ఇష్టం లేని అసౌకర్యమైన డ్యాన్స్ స్టెప్స్ వేయాలని తనపై ఒత్తిడి తెచ్చారని 2018లో ఆమె బహిరంగంగా విమర్శలు గుప్పించారు. అప్పట్లో ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. తనుశ్రీ దత్తాకు మద్దతుగా పలువురు తారలు గళం విప్పారు. అయితే నానా పటేకర్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు, తగిన ఆధారాలు లేవని 2019లో కేసును మూసివేశారు. చట్టపరంగా ఈ వివాదం ముగిసినప్పటికీ, వారిద్దరి మధ్య ఉన్న వైరం మాత్రం నానా పటేకర్ మరణం వరకు కొనసాగుతూనే ఉందని తనుశ్రీ తాజా వ్యాఖ్యలతో స్పష్టమైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 October 2026, 6:19 pm Digital Edition : Prabhanews
Tanushree Dutta: ఈవిల్ డెడ్.. నానా పటేకర్ మృతిపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 08, 2026 6:02 PM ISTబాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ మృతిపై బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారంగా మారాయి. వివరాల్లోకి పోతే.. News18బాలీవుడ్ విలక్షణ నటుడు, సీనియర్ హీరో నానా పటేకర్ (75) మంగళవారం (అక్టోబర్ 8) తెల్లవారు జామున గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుతో కన్నుమూశారు. గుండెపోటు వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. క్రాంతివీర్, పరిందా, అబ్ తక్ ఛప్పన్, వెల్‌కమ్ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో తనదైన డైలాగ్ డెలివరీ, అద్భుతమైన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నానా పటేకర్ మరణవార్తతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. బాలీవుడ్, మరాఠీ సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. కేవలం నటుడిగానే కాకుండా 'నామ్ ఫౌండేషన్' ద్వారా ఎంతో మంది రైతులను ఆదుకున్న గొప్ప సామాజిక సేవకుడిగా ఆయనకు పేరుంది.అయితే, మొత్తం దేశం ఆయన మృతికి సంతాపం తెలుపుతున్న వేళ, బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారంగా మారాయి. నానా పటేకర్ మృతి గురించి నేరుగా ఆయన పేరు ప్రస్తావించకుండా తనుశ్రీ దత్తా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. "ఈ వార్త విన్న వెంటనే ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు. ప్రస్తుతం నేను లక్నోలో జరగబోయే ఒక ముఖ్యమైన ఈవెంట్‌కి వెళ్తున్నాను. నా దృష్టంతా దానిపైనే ఉంది. నేను రెడీ అవుతున్న సమయంలో ఈ వార్త రావడం నాకు చాలా విచిత్రంగా అనిపించింది" అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ వార్త కారణంగా మీడియా మొత్తం తన కార్యక్రమాన్ని పక్కనపెట్టి అటువైపు దృష్టి మళ్లిస్తుందేమోనని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ వీడియోలో ఆమె ‘ఈవిల్ డెడ్’ (Evil Dead) అనే పదాన్ని ఉపయోగించడం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, మానవతా దృక్పథంతో ఆయన కుటుంబానికి మాత్రం తన సానుభూతిని తెలియజేశారు.
This is Pathetic 😤😠
#TanushreeDutta says she's heard about #NanaPatekar's demise and is worried that her event might get affect by this. "Evil Dead.Such an odd day. I have an important event today and now this. Media will be asking questions and I'll give my reaction to all of them."— $@M (@SAMTHEBESTEST_) October 8, 2026వీరిద్దరి మధ్య ఉన్న పాత వివాదమే తనుశ్రీ దత్తా ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 2018లో బాలీవుడ్‌ను కుదిపేసిన 'మీటూ' (#MeToo) ఉద్యమానికి ఆజ్యం పోసింది తనుశ్రీ దత్తానే. 2008లో వచ్చిన ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్‌లో ఒక పాట చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తన పట్ల లైంగికంగా, అనుచితంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. తనకు ఏమాత్రం ఇష్టం లేని అసౌకర్యమైన డ్యాన్స్ స్టెప్స్ వేయాలని తనపై ఒత్తిడి తెచ్చారని 2018లో ఆమె బహిరంగంగా విమర్శలు గుప్పించారు. అప్పట్లో ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. తనుశ్రీ దత్తాకు మద్దతుగా పలువురు తారలు గళం విప్పారు. అయితే నానా పటేకర్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు, తగిన ఆధారాలు లేవని 2019లో కేసును మూసివేశారు. చట్టపరంగా ఈ వివాదం ముగిసినప్పటికీ, వారిద్దరి మధ్య ఉన్న వైరం మాత్రం నానా పటేకర్ మరణం వరకు కొనసాగుతూనే ఉందని తనుశ్రీ తాజా వ్యాఖ్యలతో స్పష్టమైంది.మరింత చదవండి

Source link