ప్రభన్యూస్

Taapsee Pannu: నా ఎదుగుదలను తట్టుకోలేకపోయారు.. బాలీవుడ్‌పై తాప్సీ పన్ను ఫైర్! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

టాలీవుడ్, బాలీవుడ్‌లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, సస్పెన్స్ థ్రిల్లర్లు, కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె.. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే తన ప్రతిభతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.

News18
News18

టాలీవుడ్, బాలీవుడ్‌లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, సస్పెన్స్ థ్రిల్లర్లు, కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె.. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే తన ప్రతిభతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. అయితే, ఇండస్ట్రీలో తన ప్రయాణం అంత సులభంగా సాగలేదని తాప్సీ తాజాగా వెల్లడించారు. తన వెనుక ఎలాంటి సినీ కుటుంబం, గాడ్‌ఫాదర్ లేకపోవడంతో కొంతమంది తన ఎదుగుదలను జీర్ణించుకోలేకపోయారని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ముఖ్యంగా బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘డంకీ’ సినిమాలో కథానాయికగా అవకాశం రావడం అప్పట్లో చాలామందికి ఆశ్చర్యం కలిగించిందని తాప్సీ గుర్తుచేసుకున్నారు. తనకు పెద్ద స్టార్ ఫ్యామిలీ అండ లేదని, పరిశ్రమలో తనకు అవకాశాలు ఇప్పించే గాడ్‌ఫాదర్ కూడా ఎవరూ లేరని స్పష్టం చేశారు. అలాగే, తన వెనుక పెద్ద నిర్మాణ సంస్థ మద్దతు కూడా లేదని చెప్పారు. ఇలాంటి నేపథ్యం లేని తనకు షారూఖ్ ఖాన్ వంటి స్టార్ హీరో సినిమాలో అవకాశం రావడంతో కొంతమంది ఆశ్చర్యపోయారని ఆమె పేర్కొన్నారు.

‘డంకీ’ చిత్రానికి దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ. ఆయనతో అంతకుముందు తాను ఎప్పుడూ కలిసి పనిచేయలేదని తాప్సీ తెలిపారు. షారూఖ్ ఖాన్ వ్యక్తిగత పరిచయాల వలయంలోనూ తాను భాగం కాదని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో తనకు ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చిందనే ప్రశ్నలు చాలామందిలో తలెత్తాయని గుర్తుచేసుకున్నారు. అయితే, ఈ అవకాశం వెనుక ఎలాంటి సిఫార్సులు లేవని, తన నటన నచ్చడంతోనే దర్శకుడు తనను సంప్రదించారని ఆమె వివరించారు.

ఒక సినిమాలో తన నటనను చూసిన రాజ్‌కుమార్ హిరానీ తన కార్యాలయానికి పిలిపించారని తాప్సీ వెల్లడించారు. ఆ తర్వాత ‘డంకీ’ కథ వినిపిస్తానని ఆయన చెప్పడంతో మొదట తాను నమ్మలేకపోయానని గుర్తుచేసుకున్నారు. అంతటి ప్రముఖ దర్శకుడు తనను సంప్రదించడం, షారూఖ్ ఖాన్ సరసన నటించే అవకాశం రావడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభవమని ఆమె చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్‌లోకి తాను రావడాన్ని కొంతమంది అంగీకరించలేకపోయారని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో తనపై జరిగిన ప్రచారాల గురించి కూడా తాప్సీ స్పందించారు. తన వ్యక్తిగత జీవితం గురించి పరిశ్రమలో చాలామందికి పెద్దగా తెలియకపోవడంతో కొంతమంది ఇష్టం వచ్చినట్లు కథలు అల్లారని ఆమె ఆరోపించారు. తనతో పనిచేయడం కష్టమని, తనతో కలిసి పనిచేయడానికి ఎవరూ ఆసక్తి చూపరని, తన వల్ల సమస్యలు వస్తాయని ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో తన ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం జరిగిందని ఆమె పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 October 2026, 9:13 pm Digital Edition : Prabhanews
Taapsee Pannu: నా ఎదుగుదలను తట్టుకోలేకపోయారు.. బాలీవుడ్‌పై తాప్సీ పన్ను ఫైర్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 28, 2026 9:07 PM ISTటాలీవుడ్, బాలీవుడ్‌లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, సస్పెన్స్ థ్రిల్లర్లు, కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె.. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే తన ప్రతిభతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.News18టాలీవుడ్, బాలీవుడ్‌లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, సస్పెన్స్ థ్రిల్లర్లు, కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె.. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే తన ప్రతిభతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. అయితే, ఇండస్ట్రీలో తన ప్రయాణం అంత సులభంగా సాగలేదని తాప్సీ తాజాగా వెల్లడించారు. తన వెనుక ఎలాంటి సినీ కుటుంబం, గాడ్‌ఫాదర్ లేకపోవడంతో కొంతమంది తన ఎదుగుదలను జీర్ణించుకోలేకపోయారని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.ముఖ్యంగా బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘డంకీ’ సినిమాలో కథానాయికగా అవకాశం రావడం అప్పట్లో చాలామందికి ఆశ్చర్యం కలిగించిందని తాప్సీ గుర్తుచేసుకున్నారు. తనకు పెద్ద స్టార్ ఫ్యామిలీ అండ లేదని, పరిశ్రమలో తనకు అవకాశాలు ఇప్పించే గాడ్‌ఫాదర్ కూడా ఎవరూ లేరని స్పష్టం చేశారు. అలాగే, తన వెనుక పెద్ద నిర్మాణ సంస్థ మద్దతు కూడా లేదని చెప్పారు. ఇలాంటి నేపథ్యం లేని తనకు షారూఖ్ ఖాన్ వంటి స్టార్ హీరో సినిమాలో అవకాశం రావడంతో కొంతమంది ఆశ్చర్యపోయారని ఆమె పేర్కొన్నారు.‘డంకీ’ చిత్రానికి దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ. ఆయనతో అంతకుముందు తాను ఎప్పుడూ కలిసి పనిచేయలేదని తాప్సీ తెలిపారు. షారూఖ్ ఖాన్ వ్యక్తిగత పరిచయాల వలయంలోనూ తాను భాగం కాదని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో తనకు ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చిందనే ప్రశ్నలు చాలామందిలో తలెత్తాయని గుర్తుచేసుకున్నారు. అయితే, ఈ అవకాశం వెనుక ఎలాంటి సిఫార్సులు లేవని, తన నటన నచ్చడంతోనే దర్శకుడు తనను సంప్రదించారని ఆమె వివరించారు.ఒక సినిమాలో తన నటనను చూసిన రాజ్‌కుమార్ హిరానీ తన కార్యాలయానికి పిలిపించారని తాప్సీ వెల్లడించారు. ఆ తర్వాత ‘డంకీ’ కథ వినిపిస్తానని ఆయన చెప్పడంతో మొదట తాను నమ్మలేకపోయానని గుర్తుచేసుకున్నారు. అంతటి ప్రముఖ దర్శకుడు తనను సంప్రదించడం, షారూఖ్ ఖాన్ సరసన నటించే అవకాశం రావడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభవమని ఆమె చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్‌లోకి తాను రావడాన్ని కొంతమంది అంగీకరించలేకపోయారని ఆమె అభిప్రాయపడ్డారు.ఇదే సమయంలో తనపై జరిగిన ప్రచారాల గురించి కూడా తాప్సీ స్పందించారు. తన వ్యక్తిగత జీవితం గురించి పరిశ్రమలో చాలామందికి పెద్దగా తెలియకపోవడంతో కొంతమంది ఇష్టం వచ్చినట్లు కథలు అల్లారని ఆమె ఆరోపించారు. తనతో పనిచేయడం కష్టమని, తనతో కలిసి పనిచేయడానికి ఎవరూ ఆసక్తి చూపరని, తన వల్ల సమస్యలు వస్తాయని ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో తన ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం జరిగిందని ఆమె పేర్కొన్నారు.మరింత చదవండి

Source link