Last Updated:
టాలీవుడ్ నటుడు సునీల్ మరో ఆసక్తికరమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. లోమేష్ పుడిపెద్ది హీరోగా, జయశ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డ్యూ డేట్’లో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
టాలీవుడ్ నటుడు సునీల్ మరో ఆసక్తికరమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. లోమేష్ పుడిపెద్ది హీరోగా, జయశ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్యూ డేట్’లో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పవర్‌ఫుల్ లాయర్‌గా కనిపించబోతుండటం విశేషం. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌లో తాజాగా సునీల్ కూడా పాల్గొన్నారు. ఆయన పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

వరిష్ స్టూడియోస్ పతాకంపై పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆనంద్.కె దర్శకత్వం వహిస్తున్నారు. లోమేష్ పుడిపెద్ది, జయశ్రీ జంటగా నటిస్తుండగా, ప్రణీత పట్నాయక్, విజ్ఞాని ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఇటీవలే ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. తాజా షెడ్యూల్‌లో కథకు కీలకమైన పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
‘డ్యూ డేట్’లో సునీల్ శేఖర్ చంద్ర అనే పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర తన కెరీర్‌లోనే భిన్నమైనదిగా నిలుస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. కథలో ఆయన పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, సినిమా ఆసక్తికరంగా సాగేందుకు ఇది కీలకంగా మారుతుందని వెల్లడించారు. ఇటీవల ప్రముఖ హాస్యనటుడు కృష్ణభగవాన్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో చేరారు. చాలా కాలం విరామం తర్వాత ఆయన ఓ మంచి పాత్రలో కనిపించబోతుండటంతో ప్రేక్షకులకు వినోదం అందించేందుకు సిద్ధమవుతున్నారు. సునీల్, కృష్ణభగవాన్‌ల పాత్రలు సినిమాలో ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి నెలకొంది.
‘డ్యూ డేట్’ను ప్రస్తుత సమాజంలో చర్చనీయాంశంగా ఉన్న ఓ అంశం ఆధారంగా రూపొందిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. పూర్తి వాణిజ్య హంగులతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోర్టు రూమ్ డ్రామాగా ప్రేక్షకులను అలరించనుంది. ప్రతి మనిషి ప్రతి నెలా గుర్తుంచుకునే ‘డ్యూ డేట్’ అనే అంశం చుట్టూ కథను అల్లినట్లు వెల్లడించారు. టైటిల్‌తో పాటు కథ, కథనాల్లోనూ కొత్తదనం ఉంటుందని, వినోదంతో పాటు ప్రేక్షకులను ఆలోచింపజేసే అంశాలు సినిమాలో ఉంటాయని పేర్కొన్నారు. ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో పాటు భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
ఈ చిత్రంలో లోమేష్ పుడిపెద్ది, జయశ్రీ, ప్రణీత పట్నాయక్, విజ్ఞాని, సునీల్, కృష్ణభగవాన్, అక్షర గౌడ తదితరులు నటిస్తున్నారు. జవ్వాడి నాయుడు ఆర్ట్ డైరెక్టర్‌గా, హరీష్ మీనన్ మాటల రచయితగా, సత్య గిడుటూరి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. చెంచు జింక సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతున్న ఈ చిత్రం నుంచి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. సునీల్ పోషిస్తున్న శేఖర్ చంద్ర పాత్ర ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

