అంతేకాకుండా, అడవి తులసి ఆకులు, వేర్లను వెంట తీసుకెళితే పాములు దగ్గరకు రాకపోవచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. పాము లేదా తేలు కాటు వంటి సందర్భాల్లో నల్ల మిరియాలు, నెయ్యి, అడవి తులసి రెండు నుంచి మూడు ఆకులను కలిపి గాయంపై రాస్తే విష ప్రభావం కొంతవరకు తగ్గేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే ఈ మొక్క ఆకుల రసాన్ని బావి నీటిలో కలిపితే సూక్ష్మజీవులు నశించే అవకాశం ఉందని, చర్మంపై దురద లేదా పొక్కులు వచ్చినప్పుడు కూడా ఆకుల రసం ఉపశమనం కలిగించవచ్చని వివరించారు.

