మొత్తంగా చూస్తే రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వ్యక్తిగత కస్టమర్లకు ఎస్‌బీఐ సూర్య ఘర్ లోన్ ఒక ఫైనాన్స్ ఆప్షన్‌గా ఉంది. రూ.6 లక్షల వరకు లోన్, గరిష్ఠంగా 120 నెలల రీపేమెంట్ కాలం, 6 నెలల మారటోరియం, నిల్ ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ-పేమెంట్ పెనాల్టీ లేకపోవడం ఈ లోన్‌లో ముఖ్యమైన అంశాలు. అయితే లోన్ తీసుకునే ముందు అర్హతలు, సిబిల్ స్కోర్, ఆదాయ పరిమితి, మార్జిన్, వడ్డీ రేటు వంటి నిబంధనలను గమనించాలి. ముందుగా పీఎం సూర్య ఘర్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, తర్వాత జన్‌సమర్థ్ ద్వారా లోన్ అప్లికేషన్ సమర్పించాలి. ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేసిన తర్వాత ఆ మొత్తం కస్టమర్ ఎస్‌బీఐ లోన్ అకౌంట్‌లో జమ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

