గెలాక్సీ ఎస్25పై ఫ్లిప్‌కార్ట్ అదనంగా రూ.5,000 బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తోంది. దీంతో రూ.62,999 ఉన్న ధర రూ.57,999కి తగ్గుతుంది. అలాగే, వర్తించే ఎక్స్ఛేంజ్ నిబంధనలకు అర్హత ఉంటే మరో రూ.5,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందొచ్చు. ఉదాహరణకు, పాత స్మార్ట్‌ఫోన్‌కు రూ.15,000 ఎక్స్ఛేంజ్ విలువ వస్తే, డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్లు కలిపి మొత్తం ప్రయోజనం రూ.25,000 వరకు ఉండొచ్చు. అలా అయితే కొత్త ఫోన్ కోసం చేతి నుంచి చెల్లించాల్సిన నగదు కేవలం రూ.37,999కి తగ్గుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. రూ.15,000 విలువైన పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌లో ఇస్తున్నారు కాబట్టి, ఆ పాత ఫోన్ విలువను కూడా లెక్కలోకి తీసుకుంటే గెలాక్సీ ఎస్25 అసలు ఖర్చు రూ.52,999 అవుతుంది. అంటే రూ.37,999 అనేది చేతి నుంచి చెల్లించే నగదు. (image: Samsung India)
