ప్రభన్యూస్

Salman Khan: నా పడక గదిలో దెయ్యం ఉంది, ఎప్పుడూ నా వెంటే ఉండేది.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సల్మాన్ ఖాన్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

బాలీవుడ్ కండల వీరుడు, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. తాజాగా ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న పాపులర్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ లో షాకింగ్ విషయాలు చెప్పారు.

News18
News18

బాలీవుడ్ కండల వీరుడు, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సల్మాన్, తాజాగా ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న పాపులర్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ లో సందడి చేశారు. ఈ ఎపిసోడ్ లో పాల్గొన్న సల్మాన్ ఖాన్, తన అభిమానులకు ఇప్పటివరకు తెలియని అనేక ఆసక్తికరమైన, అదే సమయంలో కాస్త భయపెట్టే వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తాను ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని తన పడక గదిలో జరిగిన వింత సంఘటనల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

షోలో కరణ్ జోహార్‌తో సరదాగా ముచ్చటిస్తూ.. ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమా కథ చెప్పడానికి కరణ్ మొదటిసారి గెలాక్సీ అపార్ట్‌మెంట్‌కు వచ్చిన రోజులను సల్మాన్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను చాలా చిన్న అపార్ట్‌మెంట్‌లో ఉండేవాడినని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తన పడకగదికి సంబంధించిన ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో ఉన్న సమయంలో తన పడకగదిలో ఎప్పుడూ తాను ఒంటరిగా లేనని, తనతో పాటు ఎప్పుడు మరొక అదృశ్య శక్తి ఉన్నట్లు అనిపించేదని చెప్పారు. అయితే, ఆ వ్యక్తి లేదా శక్తి ఎవరో తాను ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదని స్పష్టం చేశారు.

“నా పడక గదిలో ఎప్పుడూ వింత శబ్దాలు వచ్చేవి. నేను స్నానానికి వెళ్తే కబోర్డ్స్ వాటంతట అవే మూసుకోవడం, తెరుచుకోవడం లాంటి శబ్దాలు వినిపించేవి. నేను గదిలోంచి బయటకు రాగానే లైట్స్ వాటంతట అవే ఆఫ్ అయ్యేవి. అంతేకాకుండా, నాకు తెలియకుండానే నా మ్యూజిక్ సిస్టంలో వాటంతట అవే పాటలు ప్లే అయ్యేవి,” అంటూ సల్మాన్ తన అనుభవాలను వివరించారు. తన పడకగదిలో ఎప్పుడూ ఎవరో తనను అనుకరిస్తున్నట్లు అనిపించేదని, అయితే అది దెయ్యమా లేక ఇంకేదైనా పారానార్మల్ శక్తా అనేది తనకు ఖచ్చితంగా తెలియదని ఆయన అన్నారు. దీనికి కాస్త హాస్యాన్ని జోడిస్తూ, “ఒకవేళ నాతో పాటు ఉన్న ఆ అదృశ్య శక్తి అమ్మాయి అయితే, కనీసం ఒక్కసారైనా నాకు కనిపించు అని నేను సరదాగా అడిగేవాడిని,” అని సల్మాన్ చెప్పడంతో షోలో నవ్వులు పూశాయి. సల్మాన్ లాంటి స్టార్ హీరో గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో దెయ్యం ఉందంటూ కామెంట్స్ చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ విభిన్న రీతుల్లో స్పందిస్తున్నారు.

ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం ‘మాతృభూమి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే, దక్షిణాదిలోనూ తన మార్క్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో, స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఒక భారీ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో సల్మాన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించనున్నారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 October 2026, 10:33 am Digital Edition : Prabhanews
Salman Khan: నా పడక గదిలో దెయ్యం ఉంది, ఎప్పుడూ నా వెంటే ఉండేది.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సల్మాన్ ఖాన్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 16, 2026 10:12 AM ISTబాలీవుడ్ కండల వీరుడు, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. తాజాగా ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న పాపులర్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' లో షాకింగ్ విషయాలు చెప్పారు. News18బాలీవుడ్ కండల వీరుడు, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సల్మాన్, తాజాగా ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న పాపులర్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' లో సందడి చేశారు. ఈ ఎపిసోడ్ లో పాల్గొన్న సల్మాన్ ఖాన్, తన అభిమానులకు ఇప్పటివరకు తెలియని అనేక ఆసక్తికరమైన, అదే సమయంలో కాస్త భయపెట్టే వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తాను ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని తన పడక గదిలో జరిగిన వింత సంఘటనల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.షోలో కరణ్ జోహార్‌తో సరదాగా ముచ్చటిస్తూ.. 'కుచ్ కుచ్ హోతా హై' సినిమా కథ చెప్పడానికి కరణ్ మొదటిసారి గెలాక్సీ అపార్ట్‌మెంట్‌కు వచ్చిన రోజులను సల్మాన్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను చాలా చిన్న అపార్ట్‌మెంట్‌లో ఉండేవాడినని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తన పడకగదికి సంబంధించిన ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో ఉన్న సమయంలో తన పడకగదిలో ఎప్పుడూ తాను ఒంటరిగా లేనని, తనతో పాటు ఎప్పుడు మరొక అదృశ్య శక్తి ఉన్నట్లు అనిపించేదని చెప్పారు. అయితే, ఆ వ్యక్తి లేదా శక్తి ఎవరో తాను ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదని స్పష్టం చేశారు."నా పడక గదిలో ఎప్పుడూ వింత శబ్దాలు వచ్చేవి. నేను స్నానానికి వెళ్తే కబోర్డ్స్ వాటంతట అవే మూసుకోవడం, తెరుచుకోవడం లాంటి శబ్దాలు వినిపించేవి. నేను గదిలోంచి బయటకు రాగానే లైట్స్ వాటంతట అవే ఆఫ్ అయ్యేవి. అంతేకాకుండా, నాకు తెలియకుండానే నా మ్యూజిక్ సిస్టంలో వాటంతట అవే పాటలు ప్లే అయ్యేవి," అంటూ సల్మాన్ తన అనుభవాలను వివరించారు. తన పడకగదిలో ఎప్పుడూ ఎవరో తనను అనుకరిస్తున్నట్లు అనిపించేదని, అయితే అది దెయ్యమా లేక ఇంకేదైనా పారానార్మల్ శక్తా అనేది తనకు ఖచ్చితంగా తెలియదని ఆయన అన్నారు. దీనికి కాస్త హాస్యాన్ని జోడిస్తూ, "ఒకవేళ నాతో పాటు ఉన్న ఆ అదృశ్య శక్తి అమ్మాయి అయితే, కనీసం ఒక్కసారైనా నాకు కనిపించు అని నేను సరదాగా అడిగేవాడిని," అని సల్మాన్ చెప్పడంతో షోలో నవ్వులు పూశాయి. సల్మాన్ లాంటి స్టార్ హీరో గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో దెయ్యం ఉందంటూ కామెంట్స్ చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ విభిన్న రీతుల్లో స్పందిస్తున్నారు.ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం 'మాతృభూమి' అనే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే, దక్షిణాదిలోనూ తన మార్క్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో, స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఒక భారీ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో సల్మాన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించనున్నారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.మరింత చదవండి

Source link