Last Updated:
టాలీవుడ్ సీనియర్ నటి రోజా (Roja Selvamani) బర్త్ డే వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ పుట్టినరోజు వేడుకల్లో ప్రముఖ సినీతారలు సందడి చేయడంతో అక్కడి వాతావరణం హుషారెత్తిపోయింది.
టాలీవుడ్ సీనియర్ నటి రోజా (Roja Selvamani) బర్త్ డే వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ పుట్టినరోజు వేడుకల్లో ప్రముఖ సినీతారలు సందడి చేయడంతో అక్కడి వాతావరణం హుషారెత్తిపోయింది. ఈ వేడుకల్లో ప్రభుదేవా, డైరెక్టర్ శంకర్, మీనా లతో పాటు రోజా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సినీ నటిగానే కాకుండా, రాజకీయ నాయకురాలిగా, బుల్లితెర జడ్జిగా తానూ ప్రత్యేకం అనే ముద్ర వేసుకుంది రోజా సెల్వమణి. ఆమె సినీ ప్రస్థానంలో బోలెడన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి.
రోజా సినీ కెరీర్ ఆరంభంలోనే దర్శకుడు ఆర్.కె. సెల్వమణితో పరిచయం ఏర్పడింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘చెంబరుతి’ (తెలుగులో చామంతి) సినిమాతోనే రోజా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. సరిగ్గా ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించి, అది ప్రేమగా మారింది. అయితే, వీరి ప్రేమకథ అప్పట్లో ఒక సంచలనం. ఎందుకంటే వీరిద్దరూ వివాహం చేసుకోవడానికి దాదాపు 10 ఏళ్ల సమయం పట్టింది.
ரோஜா பிறந்த நாளுக்கு கேக் ஊட்டிய பிரபு தேவா, மீனா 😍🥰❤️ https://t.co/yUdb4Q3XDp
— Anshitha🫶💖🍉 (@Anshithaprincey) November 17, 2026
ప్రేమలో ఉన్నప్పటికీ వెంటనే పెళ్లి చేసుకోకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. సెల్వమణి తన కుటుంబ బాధ్యతలను పూర్తి చేయాలని భావించారు. తన సోదరీమణుల వివాహాలు జరిగి, వారు జీవితంలో స్థిరపడే వరకు పెళ్లి చేసుకోనని ఆయన రోజాకు చెప్పారు. ఆయన ఆశయానికి గౌరవమిస్తూ రోజా కూడా పదేళ్ల పాటు ఓపికగా వేచి చూశారు. 2002లో వీరిద్దరూ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరికి అన్షుమాలిక, కృష్ణ లోహిత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రోజా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఆమె ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సొంతంగా సినిమాలు నిర్మించి నష్టపోవడం, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల ఆమె తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఆ సమయంలో సెల్వమణి ఆమెకు కొండంత అండగా నిలిచారు. ఇదిలాఉంటే, అప్పట్లో.. పాపులర్ డైరెక్టర్ ప్రేమిస్తున్న అమ్మాయిని కావడంతో తనను అందరూ రెస్పెక్ట్ తో చూసేవారని.. హీరోలు కూడా ఎవ్వరూ తనకు ప్రపోజ్ చేయలేదని రోజా చెప్పింది. అలాంటిది వేధించడం అంటారా? అది అసలు జరగనే లేదు. సెల్వమణి గారిని ప్రేమించడం కెరీర్ బిగినింగ్ లో నాకు రక్షణ గా నిలిచిందని రోజా ఓ సందర్భంలో చెప్పారు.

