ప్రభన్యూస్

Redmi Note 17: రెడ్‌మీ నోట్ 17 వచ్చేసింది… అమొలెడ్ డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ, 50MP కెమెరా | Redmi Note 17 5G Arrives in India With Massive battery | బిజినెస్


Last Updated:

Redmi Note 17 | భారీ బ్యాటరీ, అమొలెడ్ డిస్‌ప్లే, బిగ్ కెమెరాతో రెడ్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ అయింది. రెడ్‌మీ నోట్ 17 5జీ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇప్పుడు తెలుసుకుందాం.

Redmi Note 17: రెడ్‌మీ నోట్ 17 వచ్చేసింది... అమొలెడ్ డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ, 50MP కెమెరా (image: Xiaomi India)
Redmi Note 17: రెడ్‌మీ నోట్ 17 వచ్చేసింది… అమొలెడ్ డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ, 50MP కెమెరా (image: Xiaomi India)

రెడ్‌మీ నోట్ 17 5జీని భారత్‌లో విడుదల చేశారు. నోట్ 17 సిరీస్‌లో ఇండియాలో రిలీజ్ అయిన తొలి ఫోన్ ఇదే. ఇందులో ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 సిరీస్ చిప్‌సెట్, 8,000ఎంఏహెచ్ బ్యాటరీ, 6.9 అంగుళాల ట్రూకలర్ అమొలెడ్ డిస్‌ప్లే లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రెడ్‌మీ నోట్ 17 5జీ ధర 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్‌కు రూ.27,999గా ఉంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉన్న టాప్ వేరియంట్ ధర రూ.30,999గా నిర్ణయించారు. ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను కంపెనీ అందిస్తోంది. ఆగస్టు 12 నుంచి అమెజాన్, షావోమీ ఆన్‌లైన్ స్టోర్‌లో కొనొచ్చు. రెడ్‌మీ నోట్ 17 5జీ ఆర్కిటిక్ బ్లూ, డార్క్ నైట్, స్టార్లైట్ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది.

రెడ్‌మీ నోట్ 17 5జీ డీటెయిల్డ్ ఫీచర్స్ చూస్తే ఇందులో 120హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ రక్షణ ఇచ్చారు. తడి లేదా చెమటగా ఉన్న వేళ్లతో కూడా టచ్ స్పందన మెరుగ్గా ఉండేందుకు హైడ్రోటచ్ 2.0 ఫీచర్‌ను అందించారు. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ65 రేటింగ్ కూడా ఉంది. ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు. ఈ మొబైల్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 2టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Post Office Scheme: రోజుకు రూ.100 పొదుపు చేస్తే… మీ కూతురు పేరుపై రూ.16 లక్షల సంపద

కెమెరా విషయానికి వస్తే, రెడ్‌మీ నోట్ 17 5జీలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్‌గా ఉంది. ఇది ఎఫ్/1.8 అపర్చర్‌తో పాటు 2ఎక్స్ డిజిటల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. ఎల్‌ఈడీ ఫ్లాష్ కూడా ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది ఎఫ్/2.0 అపర్చర్‌తో వస్తుంది. హోల్-పంచ్ డిస్‌ప్లే కటౌట్‌లో ఈ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌లో గరిష్టంగా 1080పీ/30ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్ చేయవచ్చు.

బ్యాటరీ పరంగా చూస్తే, రెడ్‌మీ నోట్ 17 5జీలో 8,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5వాట్ వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 2.5 రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ చెబుతోంది. ఒక్కసారి ఛార్జ్‌తో ఈ ఫోన్‌లో యూట్యూబ్‌లో 28.29 గంటల వరకు వీడియోలు చూడొచ్చని, వాట్సాప్‌ను 24.14 గంటల వరకు ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది. అలాగే గూగుల్ మ్యాప్స్ ద్వారా 10.58 గంటల వరకు జీపీఎస్ నావిగేషన్, బీజీఎంఐ గేమ్‌ను 13.89 గంటల వరకు ఆడుకోవచ్చని పేర్కొంది.

ఇది కూడా చదవండి: ఒకే ట్రిప్‌లో శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్ చూడొచ్చు… హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ సూపర్ ప్యాకేజీ

ఇది డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్. ఇందులో షావోమీ కొత్త హైపర్‌ఓఎస్ 3 ఉంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేస్తుంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌కు నాలుగేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్లు, ఆరేళ్ల పాటు సెక్యూరిటీ ప్యాచ్‌లు అందిస్తామని కంపెనీ తెలిపింది. బరువు సుమారు 225 గ్రాములు. మొత్తంగా, రెడ్‌మీ నోట్ 17 5జీ పెద్ద బ్యాటరీ, అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 5జీ పనితీరు, మంచి కెమెరా ఫీచర్లతో వచ్చిన కొత్త స్మార్ట్‌ఫోన్. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, రోజువారీ వినియోగానికి సరిపోయే ఫీచర్లు కోరుకునే వినియోగదారులకు ఈ ఫోన్ ఒక కొత్త ఎంపికగా నిలవనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 August 2026, 3:32 pm Digital Edition : Prabhanews
Redmi Note 17: రెడ్‌మీ నోట్ 17 వచ్చేసింది… అమొలెడ్ డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ, 50MP కెమెరా | Redmi Note 17 5G Arrives in India With Massive battery | బిజినెస్

Last Updated:Aug 06, 2026 3:19 PM ISTRedmi Note 17 | భారీ బ్యాటరీ, అమొలెడ్ డిస్‌ప్లే, బిగ్ కెమెరాతో రెడ్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ అయింది. రెడ్‌మీ నోట్ 17 5జీ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇప్పుడు తెలుసుకుందాం.Redmi Note 17: రెడ్‌మీ నోట్ 17 వచ్చేసింది... అమొలెడ్ డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ, 50MP కెమెరా (image: Xiaomi India)రెడ్‌మీ నోట్ 17 5జీని భారత్‌లో విడుదల చేశారు. నోట్ 17 సిరీస్‌లో ఇండియాలో రిలీజ్ అయిన తొలి ఫోన్ ఇదే. ఇందులో ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 సిరీస్ చిప్‌సెట్, 8,000ఎంఏహెచ్ బ్యాటరీ, 6.9 అంగుళాల ట్రూకలర్ అమొలెడ్ డిస్‌ప్లే లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రెడ్‌మీ నోట్ 17 5జీ ధర 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్‌కు రూ.27,999గా ఉంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉన్న టాప్ వేరియంట్ ధర రూ.30,999గా నిర్ణయించారు. ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను కంపెనీ అందిస్తోంది. ఆగస్టు 12 నుంచి అమెజాన్, షావోమీ ఆన్‌లైన్ స్టోర్‌లో కొనొచ్చు. రెడ్‌మీ నోట్ 17 5జీ ఆర్కిటిక్ బ్లూ, డార్క్ నైట్, స్టార్లైట్ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది.రెడ్‌మీ నోట్ 17 5జీ డీటెయిల్డ్ ఫీచర్స్ చూస్తే ఇందులో 120హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ రక్షణ ఇచ్చారు. తడి లేదా చెమటగా ఉన్న వేళ్లతో కూడా టచ్ స్పందన మెరుగ్గా ఉండేందుకు హైడ్రోటచ్ 2.0 ఫీచర్‌ను అందించారు. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ65 రేటింగ్ కూడా ఉంది. ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు. ఈ మొబైల్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 2టీబీ వరకు పెంచుకోవచ్చు.ఇది కూడా చదవండి: Post Office Scheme: రోజుకు రూ.100 పొదుపు చేస్తే... మీ కూతురు పేరుపై రూ.16 లక్షల సంపదకెమెరా విషయానికి వస్తే, రెడ్‌మీ నోట్ 17 5జీలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్‌గా ఉంది. ఇది ఎఫ్/1.8 అపర్చర్‌తో పాటు 2ఎక్స్ డిజిటల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. ఎల్‌ఈడీ ఫ్లాష్ కూడా ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది ఎఫ్/2.0 అపర్చర్‌తో వస్తుంది. హోల్-పంచ్ డిస్‌ప్లే కటౌట్‌లో ఈ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌లో గరిష్టంగా 1080పీ/30ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్ చేయవచ్చు.బ్యాటరీ పరంగా చూస్తే, రెడ్‌మీ నోట్ 17 5జీలో 8,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5వాట్ వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 2.5 రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ చెబుతోంది. ఒక్కసారి ఛార్జ్‌తో ఈ ఫోన్‌లో యూట్యూబ్‌లో 28.29 గంటల వరకు వీడియోలు చూడొచ్చని, వాట్సాప్‌ను 24.14 గంటల వరకు ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది. అలాగే గూగుల్ మ్యాప్స్ ద్వారా 10.58 గంటల వరకు జీపీఎస్ నావిగేషన్, బీజీఎంఐ గేమ్‌ను 13.89 గంటల వరకు ఆడుకోవచ్చని పేర్కొంది.ఇది కూడా చదవండి: ఒకే ట్రిప్‌లో శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్ చూడొచ్చు... హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ సూపర్ ప్యాకేజీఇది డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్. ఇందులో షావోమీ కొత్త హైపర్‌ఓఎస్ 3 ఉంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేస్తుంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌కు నాలుగేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్లు, ఆరేళ్ల పాటు సెక్యూరిటీ ప్యాచ్‌లు అందిస్తామని కంపెనీ తెలిపింది. బరువు సుమారు 225 గ్రాములు. మొత్తంగా, రెడ్‌మీ నోట్ 17 5జీ పెద్ద బ్యాటరీ, అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 5జీ పనితీరు, మంచి కెమెరా ఫీచర్లతో వచ్చిన కొత్త స్మార్ట్‌ఫోన్. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, రోజువారీ వినియోగానికి సరిపోయే ఫీచర్లు కోరుకునే వినియోగదారులకు ఈ ఫోన్ ఒక కొత్త ఎంపికగా నిలవనుంది.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link