Last Updated:
గోల్డ్ లోన్ తీసుకుంటే ఎంత వరకు డబ్బు వస్తుంది? 50 గ్రాముల బంగారానికి ఎంత రుణం ఇస్తారు? RBI కొత్త నిబంధనల్లో చాలామందికి తెలియని కీలక రూల్స్ ఉన్నాయి.
అత్యవసర ఆర్థిక అవసరాలు వచ్చినప్పుడు చాలా మంది బంగారు నగలను విక్రయించడం కంటే వాటిని తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుంటారు. వ్యక్తిగత అవసరాలు, చిన్న వ్యాపారాల నిర్వహణ వంటి సందర్భాల్లో గోల్డ్ లోన్ వేగంగా నిధులు సమకూర్చే మార్గంగా మారింది. అయితే ఎంత బంగారం ఉంటే ఎంత రుణం లభిస్తుంది? బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఏ విధంగా విలువ నిర్ణయిస్తాయి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అమలు చేస్తున్న తాజా నిబంధనలు ఏమిటి? వంటి అంశాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

