మీరు ఇల్లు లేదా కమర్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేస్తుంటే, మీరు తప్పనిసరిగా దాని లే-అవుట్‌ను (Layout) చెక్ చేయాలి. వాస్తవానికి, ప్రతి నగరం యొక్క సంబంధిత అధికార వ్యవస్థ ద్వారా ఇల్లు లేదా దుకాణం లేఅవుట్‌ను ఆమోదించడం అవసరం. మీరు అథారిటీ (లేదా అధికార యంత్రాంగం) సెట్ చేసిన లేఅవుట్‌ను ఉల్లంఘించిన ఆస్తిని కొనుగోలు చేసినట్లయితే, దానితో తర్వాత ఇబ్బందులు రావొచ్చు. అందువల్ల, లేఅవుట్ పేపర్‌ను చూడటం కూడా చాలా ముఖ్యమైన విషయాలలో ఒకటి.

