ప్రభన్యూస్

Preity Zinta Effair: ప్రీతీ జింతాతో సీక్రెట్ ఎఫైర్.. ఇన్నేళ్లకు స్టార్ క్రికెటర్ ఓపెన్ అయ్యరిలా..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభమైన కొత్తలో.. అంటే 2008 నుంచి 2011 మధ్య కాలంలో ప్రీతీ జింతాతో బ్రెట్ లీ సీక్రెట్ ఎఫైర్ నడిచిందనే పుకార్లు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై బ్రెట్ లీ స్వయంగా స్పందించారు.

News18
News18

క్రికెట్‌కు, బాలీవుడ్‌కు మధ్య ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. దశాబ్దాలుగా క్రికెటర్లు, సినీ తారల మధ్య ప్రేమాయణాలు, పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో తరచూ ఏదో ఒక డేటింగ్ రూమర్ తెరపైకి వస్తూనే ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ఒక పుకారు గత కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ బ్రెట్ లీ, బాలీవుడ్ డింపుల్ బ్యూటీ ప్రీతీ జింటా మధ్య కూడా గట్టిగా వినిపించింది. అయితే, తాజాగా ఈ పాత డేటింగ్ రూమర్లపై ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ ఎట్టకేలకు మౌనం వీడారు. తామిద్దరం ఎప్పుడూ డేటింగ్ చేయలేదని, కేవలం మంచి స్నేహితులుగా మాత్రమే ఉన్నామని ఆయన స్పష్టం చేస్తూ వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు.

ఐపీఎల్ సమయంలో మొదలైన పుకార్లు:

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభమైన కొత్తలో.. అంటే 2008 నుంచి 2011 మధ్య కాలంలో బ్రెట్ లీ కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఆ జట్టుకు బాలీవుడ్ నటి ప్రీతీ జింటా సహ యజమాని. ఆ సమయంలో జట్టు విజయాలను కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, మ్యాచ్‌ల తర్వాత పార్టీల్లో పాల్గొనడం సర్వసాధారణంగా జరిగేది. ఈ క్రమంలోనే ఒకసారి ముంబైలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో వీరిద్దరూ కలిసి డిన్నర్ చేస్తూ కెమెరాలకు చిక్కారు. దీంతో అప్పట్లో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వైరల్ అయ్యాయి.

ప్రీతీ అత్యంత తెలివైన మహిళ: బ్రెట్ లీ

చాలా సంవత్సరాల తర్వాత ఈ వార్తలపై బ్రెట్ లీ ఓపెన్ అయ్యారు. ఇటీవ‌ల ఒక మీడియా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “ప్రీతి జింటా అత్యంత తెలివైన మహిళ, అద్భుతమైన వ్యక్తిత్వం కలది. ఆమెపై నాకు ఎంతో గౌరవం ఉంది. మా మధ్య డేటింగ్ నడుస్తోందంటూ వచ్చిన నిరాధారమైన కథనాలు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే వాస్తవం ఏమిటో నాకు స్పష్టంగా తెలుసు. ప్రజలు తమకు నచ్చింది ఊహించుకుంటారు, రకరకాలుగా రాసుకుంటారు. కానీ ఆ పుకార్లను నేను ఎప్పుడూ పట్టించుకోలేదు” అని పేర్కొన్నారు. నిజానికి 2010లోనే ప్రీతి జింటా కూడా ఈ రూమర్లపై స్పందించారు. బ్రెట్ లీతో తనను రొమాంటిక్‌గా ముడిపెట్టడం ఇక ఆపేయాలని, తామిద్దరం కేవలం స్నేహితులమేనని అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు.

ఎవరి జీవితాల్లో వారు బిజీగా..

ప్రస్తుతం వీరిద్దరూ తమ తమ వ్యక్తిగత జీవితాల్లో సెటిల్ అయ్యి చాలా సంతోషంగా ఉన్నారు. బ్రెట్ లీ 2014లో లానా అండర్సన్‌ను వివాహం చేసుకోగా, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు, ప్రీతి జింటా 2016లో అమెరికన్ వ్యాపారవేత్త జీన్ గుడ్‌ఇనఫ్‌ను పెళ్లాడారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. పెళ్లి తర్వాత బాలీవుడ్‌కు కాస్త దూరమైన ప్రీతీ జింటా, త్వరలో ‘బట్వారా 1947’ (Batwara 1947) చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 August 2026, 3:35 pm Digital Edition : Prabhanews
Preity Zinta Effair: ప్రీతీ జింతాతో సీక్రెట్ ఎఫైర్.. ఇన్నేళ్లకు స్టార్ క్రికెటర్ ఓపెన్ అయ్యరిలా..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 05, 2026 3:19 PM IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభమైన కొత్తలో.. అంటే 2008 నుంచి 2011 మధ్య కాలంలో ప్రీతీ జింతాతో బ్రెట్ లీ సీక్రెట్ ఎఫైర్ నడిచిందనే పుకార్లు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై బ్రెట్ లీ స్వయంగా స్పందించారు. News18క్రికెట్‌కు, బాలీవుడ్‌కు మధ్య ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. దశాబ్దాలుగా క్రికెటర్లు, సినీ తారల మధ్య ప్రేమాయణాలు, పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో తరచూ ఏదో ఒక డేటింగ్ రూమర్ తెరపైకి వస్తూనే ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ఒక పుకారు గత కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ బ్రెట్ లీ, బాలీవుడ్ డింపుల్ బ్యూటీ ప్రీతీ జింటా మధ్య కూడా గట్టిగా వినిపించింది. అయితే, తాజాగా ఈ పాత డేటింగ్ రూమర్లపై ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ ఎట్టకేలకు మౌనం వీడారు. తామిద్దరం ఎప్పుడూ డేటింగ్ చేయలేదని, కేవలం మంచి స్నేహితులుగా మాత్రమే ఉన్నామని ఆయన స్పష్టం చేస్తూ వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు.ఐపీఎల్ సమయంలో మొదలైన పుకార్లు:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభమైన కొత్తలో.. అంటే 2008 నుంచి 2011 మధ్య కాలంలో బ్రెట్ లీ కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఆ జట్టుకు బాలీవుడ్ నటి ప్రీతీ జింటా సహ యజమాని. ఆ సమయంలో జట్టు విజయాలను కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, మ్యాచ్‌ల తర్వాత పార్టీల్లో పాల్గొనడం సర్వసాధారణంగా జరిగేది. ఈ క్రమంలోనే ఒకసారి ముంబైలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో వీరిద్దరూ కలిసి డిన్నర్ చేస్తూ కెమెరాలకు చిక్కారు. దీంతో అప్పట్లో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వైరల్ అయ్యాయి.ప్రీతీ అత్యంత తెలివైన మహిళ: బ్రెట్ లీచాలా సంవత్సరాల తర్వాత ఈ వార్తలపై బ్రెట్ లీ ఓపెన్ అయ్యారు. ఇటీవ‌ల ఒక మీడియా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. "ప్రీతి జింటా అత్యంత తెలివైన మహిళ, అద్భుతమైన వ్యక్తిత్వం కలది. ఆమెపై నాకు ఎంతో గౌరవం ఉంది. మా మధ్య డేటింగ్ నడుస్తోందంటూ వచ్చిన నిరాధారమైన కథనాలు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే వాస్తవం ఏమిటో నాకు స్పష్టంగా తెలుసు. ప్రజలు తమకు నచ్చింది ఊహించుకుంటారు, రకరకాలుగా రాసుకుంటారు. కానీ ఆ పుకార్లను నేను ఎప్పుడూ పట్టించుకోలేదు" అని పేర్కొన్నారు. నిజానికి 2010లోనే ప్రీతి జింటా కూడా ఈ రూమర్లపై స్పందించారు. బ్రెట్ లీతో తనను రొమాంటిక్‌గా ముడిపెట్టడం ఇక ఆపేయాలని, తామిద్దరం కేవలం స్నేహితులమేనని అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు.ఎవరి జీవితాల్లో వారు బిజీగా..ప్రస్తుతం వీరిద్దరూ తమ తమ వ్యక్తిగత జీవితాల్లో సెటిల్ అయ్యి చాలా సంతోషంగా ఉన్నారు. బ్రెట్ లీ 2014లో లానా అండర్సన్‌ను వివాహం చేసుకోగా, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు, ప్రీతి జింటా 2016లో అమెరికన్ వ్యాపారవేత్త జీన్ గుడ్‌ఇనఫ్‌ను పెళ్లాడారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. పెళ్లి తర్వాత బాలీవుడ్‌కు కాస్త దూరమైన ప్రీతీ జింటా, త్వరలో 'బట్వారా 1947' (Batwara 1947) చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,Telanganaమరింత చదవండి

Source link