మరోవైపు చక్రి, కేశవ, మహా ఇంటికి తిరిగి రావడంతో ఎటు వెళ్లి వస్తున్నారని పెద్ది అడుగుతాడు. ఓ పనికిమాలిన పని కోసం అని మహా అనగా.. “మేం అడిగింది చక్రి అన్నయ్య చేసే పని గురించి కాదు, మీ గురించి” అని కన్నా కౌంటర్ వేయడంతో అందరూ నవ్వేస్తారు. ఇక చక్రి చేసిన పని గురించి మహా, కేశవ చెబుతారు. పెళ్లి చూపులు చెడగొడతానన్నాడని, కానీ చెడగొట్టలేదని కేశవ అనగా, నేనేమైనా కావాలని చేశానా అని చక్రి సమాధానమిస్తాడు.(Photo Credit: podarillu Serial Star maa/ Jio + Hotstar)

