Last Updated:
PM Modi 76th Birthday: భారత ప్రధాని నరేంద్ర మోదీకి భారతీయులు సగర్వంగా జన్మదినశుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా దేశానికి ఆయన గత 25 ఏళ్లుగా చేస్తున్న సేవలను గుర్తిస్తూ దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటున్నారు.
PM Modi 76th Birthday: భారత ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17వ తేదితో 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ ఏట అడుగుపెట్టబోతున్నారు. దేశ ప్రధానిగా తన 12 ఏళ్ల సుదీర్ఘ నాయకత్వంలో దేశపురోగాభివృద్దికి, ప్రజల ఆకాంక్షలకు అనుగూణంగా సమర్ధవంతమైన పాలన అందించడమే కాకుండా దేశాన్నిసర్వతోముఖాభివృద్ది దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈసందర్భంగా ఆయనకు భారతీయులు సగర్వంగా జన్మదినశుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా దేశానికి ఆయన గత 25 ఏళ్లుగా చేస్తున్న సేవలను గుర్తిస్తూ మోదీకి దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగానే గురువారం రాత్రి 7 గంటల సమయంలో ప్రతీ ఇంట్లో ఆశీర్వాద దీపాన్ని వెలిగించాలని దేశ ప్రజలు, బీజేపీ శ్రేణులు పిలుపునిచ్చారు.
భారతదేశ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన చెరగని ముద్రగా దేశ ప్రజలు చూస్తున్నారు. మూడు పర్వాయాలు దేశానికి ప్రధానిగా.. సుమారు 12ఏళ్లకు పైగా.. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు పర్యాయాలు అంటే 13 ఏళ్లపాటు ప్రజల కోసం 25 ఏళ్లుగా దేశసేవకు అంకితమైపోయారు. అందుకే ఆయనకు దీర్ఘాయుష్షు ప్రసాదించాలని కోరుతూ ఆయురారోగ్యాలతో ఉండాలని కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ, తెలంగాణ బీజేపీ నేతలు సెప్టెంబర్ 17, సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా ఒక ‘ఆశీర్వాద దీపాన్ని’ వెలిగిద్దామని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మోదీ దేశానికి చేసిన సేవలు, భారతీయులకు కల్పించిన గుర్తింపుపై ప్రత్యేకంగా అభినందించారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
Honourable Prime Minister Sri. Narendra Modi Ji (@narendramodi)
In your remarkable journey, we see the story of a leader who rose from humble beginnings, through unwavering discipline and commitment, to become the guiding force of our great nation.
Your vision for… pic.twitter.com/5jVjeeJHqu
— Pawan Kalyan (@PawanKalyan) September 17, 2025
దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం 25 ఏళ్లుగా నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగి మన ప్రధాని నరేంద్ర మోదీ అని .. ఆయన నాయకత్వంలో భారతదేశం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ.. తెలంగాణ బీజేపీ నేతలు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెప్టెంబర్ 17న సాయంత్రం 6 – 7 గంటల మధ్య ప్రతి ఇంటా “ఆశీస్సుల దీపం” వెలిగించాలని పిలుపునిచ్చారు. దేశం కోసం అహర్నిశలు కష్టపడుతున్న మన మోదీకి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకోవాలని ప్రార్ధిస్తున్నారు.
దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం 25 ఏళ్లుగా నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగి మన మోదీ గారు!
ఆయన నాయకత్వంలో భారతదేశం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ.. మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెప్టెంబర్ 17న సాయంత్రం 6 – 7 గంటల మధ్య ప్రతి ఇంటా… pic.twitter.com/H17kSWNvaR
— BJP Telangana (@BJP4Telangana) September 16, 2026
తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ దేశానికి విశేష సేవలు అందిస్తున్న మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా రాత్రి వేళ 76,000 దీపాలు వెలిగించే కార్యక్రమాన్ని గుజరాత్ ప్రభుత్వం చేపడుతోంది. అక్కడి సీఎం భూపేంద్ర పటేల్ సమక్షంలో ఈకార్యక్రమాన్ని గురువారం చేపట్టనున్నారు. అహ్మదాబాద్‌లోని జస్పూర్‌లో ఉన్న ‘విశ్వ ఉమియా ధామ్’లో ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ రాత్రి అర్ధరాత్రి వేళ ఉమియా మాతకు నిర్వహించే ‘మహారతి’తో పాటు 76,000 దీపాలను వెలిగించనున్నారు. ప్రధాని ఆయురారోగ్యాల కోసం ప్రార్థించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అర్ధరాత్రి వేళ స్వయంగా ‘మా ఉమియ’కు మహా హారతిని సమర్పించి, ప్రధానమంత్రి సంపూర్ణ ఆరోగ్యం , దీర్ఘాయువు కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు. అదే సమయంలో ‘విశ్వ ఉమియాధామ్’లో ‘వందేమాతరం’ గీతాలాపన కూడా జరుగుతుంది. 150 మంది ‘జెన్-జీ’ (Gen Z) యువత నేతృత్వంలో ఐదు వేల మంది భక్తులు ఈ గీతాన్ని ఆలపిస్తారు. ముఖ్యమంత్రి హాజరు ఈ దేశభక్తి కార్యక్రమానికి మరింత శోభను చేకూరుస్తుంది.భక్తులు సమయానికి చేరుకునేలా వారి సౌకర్యార్థం AMTS 100 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం విశ్వాసం, దేశభక్తి , ప్రజా భాగస్వామ్యాల అద్వితీయ సంగమంగా నిలవనుంది. ఆ రాత్రి, విశ్వ ఉమియాధామం దీపాల కాంతితో వెలిగిపోతూ, ‘వందేమాతరం’ గీతాలాపనతో ప్రతిధ్వనించనుంది.

