ఇక పీఎం కిసాన్‌కు సంబంధించిన ఏ సమాచారాన్నైనా ఇతరులతో పంచుకునే ముందు దాని విశ్వసనీయతను ఎల్లప్పుడూ సరిచూసుకోవాలని, ఈ పథకానికి సంబంధించిన సమాచారం కోసం అధికారిక వనరులపై మాత్రమే ఆధారపడాలని, వదంతులను కాకుండా, సరైన సమాచారాన్ని తెలుసుకుని అవగాహన పెంచుకోవాలని పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ సూచిస్తోంది. మొత్తంగా చూస్తే, పీఎం-కిసాన్‌లో ఆధార్ ప్రధానంగా రైతు గుర్తింపును నిర్ధారించడం, లబ్ధిదారుల వివరాలను వెరిఫై చేయడం, డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి చేరేలా చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. పథకం కింద అర్హత ఉన్న రైతులకు ఏడాదికి రూ.6,000 సాయం అందుతుండగా, ఆధార్, ఈ-కేవైసీ వ్యవస్థలు ఆ సాయం సరైన లబ్ధిదారులకు చేరేలా చేయడంలో సహాయపడుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

