అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు పర్సనల్ లోన్ ఉపయోగపడుతుంది. కానీ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజులు, లోన్ గడువు, తిరిగి చెల్లించే నిబంధనలను సరిగ్గా తెలుసుకోకుండా లోన్ తీసుకుంటే, చివరికి మీరు అనుకున్నదానికంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి రావచ్చు. అందుకే పర్సనల్ లోన్ తీసుకునే ముందు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తక్కువ వడ్డీ రేటు ఉందని మాత్రమే లోన్ తీసుకోవద్దు. నిజంగా ఎంత అవసరమో అంతే అప్పు తీసుకోండి. లోన్‌ను ముందుగానే చెల్లించాలనుకుంటే ఎలాంటి నిబంధనలు ఉన్నాయో కూడా తెలుసుకోండి. మెడికల్ ఖర్చులు, ఇంటి మరమ్మతులు, ఇతర అనుకోని అవసరాల కోసం వెంటనే డబ్బు కావాలంటే పర్సనల్ లోన్ ఉపయోగపడుతుంది. అయితే, బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ ఎంత లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందనే విషయంపైనే చాలామంది దృష్టి పెడతారు. కానీ లోన్ వల్ల నిజంగా ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవడం ఇంకా ముఖ్యం. వడ్డీ రేటుతో పాటు ఇతర ఫీజులు, చెల్లింపు గడువు, ఒప్పందంలో ఉండే నిబంధనలు కూడా లోన్ ఖర్చుపై ప్రభావం చూపుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)

