నిపుణుల అభిప్రాయం ప్రకారం, పీసీఓఎస్ను నియంత్రించడంలో ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, ఓట్స్, బ్రౌన్ రైస్ లేదా గోధుమ రొట్టెలు, గుడ్లు, చేపలు, చికెన్, పెరుగు, తక్కువ చక్కెర కలిగిన పండ్లు వంటి వాటిని చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యంగా ఉంచడమే కాకుండా ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇన్సులిన్ నిరోధకత పీసీఓఎస్కు ప్రధాన కారణాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది.

