ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి కొత్త కొత్త చిట్కాలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. బేకింగ్ సోడా, వెనిగర్, నిమ్మకాయ, టూత్‌పేస్ట్ వంటి వస్తువులతో ఇంటిని మెరిపించవచ్చని చెప్పే వీడియోలు తరచూ కనిపిస్తుంటాయి. తాజాగా మరో విచిత్రమైన హ్యాక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. కిటికీ అద్దాలపై కోసిన ఉల్లిపాయను రుద్దితే అద్దాలు కొత్తవాటిలా మెరిసిపోతాయట. ఉల్లిపాయలో ఉండే సహజ పదార్థాలు గాజుపై పేరుకున్న మురికి, జిడ్డు, వేలిముద్రలు, పొగమంచు మరకలను తొలగిస్తాయని అనేక వీడియోల్లో చెబుతున్నారు. అయితే ఈ చిట్కా నిజంగానే పనిచేస్తుందా? లేక ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అయిన మరో ప్రచారమా? అనే విషయాన్ని తెలుసుకుందాం.

