ఈ కార్యక్రమ ప్రాముఖ్యతను వివరిస్తూ, రేమండ్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్ డైరెక్టర్, సీఈఓ సత్యకి ఘోష్ మాట్లాడుతూ, నమ్మకం, సొగసు, వృత్తాకార ఫ్యాషన్ (circularity) ద్వారా సమాజానికి మేలు చేయడమే తమ బ్రాండ్ ఉద్దేశమని, ఈ కార్యక్రమం ద్వారా కస్టమర్లు రేమండ్ టైలరింగ్ ఖచ్చితత్వాన్ని అనుభూతి చెందవచ్చని పేర్కొన్నారు. సేకరించిన పాత దుస్తులను ప్రసిద్ధ స్వచ్ఛంద సంస్థ ‘గోంజ్’ సర్క్యులారిటీ సెంటర్లకు పంపిస్తారు. ఈ దుస్తులు గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల పునరుద్ధరణ, వంతెనల నిర్మాణం వంటి అభివృద్ధి పనుల్లో పాల్గొనే వారికి గౌరవప్రదమైన బహుమతులుగా అందుతాయని సంస్థ వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)

