శక్తి జెన్2 ఓలా శక్తి పోర్ట్‌ఫోలియోలో ఇళ్ల కోసం రూపొందించిన మొదటి మోడల్. బ్యాటరీ బ్యాకప్, ఇంటెలిజెంట్ ఎనర్జీ మేనేజ్మెంట్, సోలార్ ఎనర్జీ స్టోరేజ్‌ను ఒకే సిస్టమ్‌లో కలిపారు. ఓలా శక్తి 4.6 కిలోవాట్అవర్ మోడల్లో 4.6 కిలోవాట్అవర్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. పవర్ 3 కిలోవాట్లు. ఫుల్ లోడ్‌పై 1.5 గంటల పవర్ బ్యాకప్ ఇస్తుంది. 9.2 కిలోవాట్అవర్ మోడల్లో 9.2 కిలోవాట్అవర్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. పవర్ 6 కిలోవాట్లు. ఫుల్ లోడ్‌పై 1.5 గంటల పవర్ బ్యాకప్ ఇస్తుంది. 4.6 కిలోవాట్అవర్ మోడల్‌కు సంబంధించిన వివరాల్లో ఒకచోట ప్రారంభ ఆఫర్ ధర రూ.1,19,999గా చూపించారు. రిజర్వేషన్ కోసం రూ.999 చెల్లించాలి. 9.2 కిలోవాట్అవర్ మోడల్‌కు ప్రారంభ ఆఫర్ ధర రూ.1,74,999గా చూపించగా, మరోచోట రూ.1,99,999గా పేర్కొన్నారు. రెండు మోడళ్ల డెలివరీలు నవంబర్ 2026 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. (image: Ola Electric)
