ప్రభన్యూస్

NHAI Rajmarg Yatra app: హైవే ప్రయాణికులకు శుభవార్త.. యాప్ ద్వారా ‘డిజిటల్ లోకల్ టోల్ పాస్’ సేవలు | బిజినెస్


ఎవరికి వర్తిస్తుంది? ప్రయోజనాలు ఏమిటి?:

ఈ కొత్త డిజిటల్ పాస్ విధానం ముఖ్యంగా టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానిక ప్రజల కోసం ప్రత్యేకంగా రూపొందించినది. ఈ నిర్దేశిత పరిధిలో నివసిస్తూ, ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్-కమర్షియల్ వాహనాలు కలిగి ఉన్న యజమానులు ఈ నెలవారీ లోకల్ పాస్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఒక్కసారి యాప్ ద్వారా పాస్ మంజూరైతే, వారు ఆ సంబంధిత టోల్ ప్లాజా ద్వారా ఒక నెల పాటు అపరిమితంగా ఉచిత ప్రయాణం చేసే సదుపాయం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి: Black Hole: మూడోసారి పేలిన బ్లాక్ హోల్.. విచిత్ర ప్రవర్తన చూసి షాకైన శాస్త్రవేత్తలు.. భూమికి ప్రమాదమా?

ఇదివరకు ఈ లోకల్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవడమే కష్టంగా ఉండేది. ప్రయాణికులు తమ ఇంటి ధృవీకరణ పత్రాలు, వాహన రిజిస్ట్రేషన్ (RC), ఆధార్ కార్డ్ వంటి ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్ల కాపీలను తీసుకుని, వ్యక్తిగతంగా టోల్ ప్లాజా కార్యాలయానికి వెళ్లి సమర్పించాల్సి వచ్చేది. అక్కడ సిబ్బంది ఆ పత్రాలను పరిశీలించి, మ్యాన్యువల్‌గా డేటా ఎంట్రీ చేసిన తర్వాతే పాస్ ఇచ్చేవారు. దీనివల్ల టైమ్ వేస్ట్ అయ్యేది, టోల్ గేట్ల దగ్గర రద్దీ పెరిగేది. ఇప్పుడు ఆ ఆఫ్‌లైన్ విధానానికి పూర్తిగా స్వస్తి చెబుతూ, స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంటి నుంచే కొన్ని నిమిషాల్లోనే దరఖాస్తు చేసుకునే వీలుంది.

టెక్నాలజీ – వెరిఫికేషన్ ప్రక్రియ:

ఈ పాస్ జారీ ప్రక్రియను అత్యంత సురక్షితంగా నిర్వహించేందుకు NHAI ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థలను రాజ్‌మార్గ్‌ యాత్ర యాప్‌తో లింక్ చేసింది. దరఖాస్తుదారు యాప్‌లో తన సమ్మతి ఇచ్చిన వెంటనే, సిస్టమ్ ఆటోమేటిక్‌గా డిజిలాకర్ (DigiLocker) ద్వారా చిరునామా వివరాల్ని సేకరిస్తుంది. అలాగే, వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాల్నీ, యాక్టివ్‌గా ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) సమాచారాన్నీ.. ప్రభుత్వ వాహన్ (VAHAN) డేటాబేస్ ద్వారా తక్షణమే ధృవీకరిస్తుంది. అంతేకాకుండా, దరఖాస్తుదారు నిజంగా ఆ 20 కిలోమీటర్ల పరిధిలోనే నివసిస్తున్నారా లేదా అని నిర్ధారించడానికి భౌగోళిక సమాచార వ్యవస్థ (GIS) ఆధారిత లొకేషన్ వెరిఫికేషన్ టెక్నాలజీని వాడుతుంది. దీనివల్ల ఎలాంటి కాగితపు పత్రాల అవసరం ఉండదు, పైగా తప్పుడు దరఖాస్తులకు ఛాన్స్ లేకుండా పాస్ ఆమోద ప్రక్రియ వేగంగా జరుగుతుంది.

ప్రస్తుతానికి ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ సేవలను ఢిల్లీలోని అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్ (UER) పై ఉన్న ముండ్కా-బక్కర్వాలా టోల్ ప్లాజా దగ్గర మాత్రమే ప్రారంభించారు. ఇక్కడ వచ్చే ప్రజల స్పందన, టెక్నాలజీ పనితీరును పూర్తిగా విశ్లేషించిన తర్వాత, రానున్న నెలల్లో దేశవ్యాప్తంగా అర్హత కలిగిన ఇతర టోల్ ప్లాజాలన్నింటికీ ఈ డిజిటల్ లోకల్ పాస్ సేవలను దశలవారీగా విస్తరిస్తామని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.

‘మార్గ్‌మిత్ర’ రూపంలో వర్చువల్ సహాయం:

ఈ డిజిటల్ పాస్ సేవలతో పాటుగా, ప్రయాణికుల సందేహాలను ఎప్పటికప్పుడు తీర్చడానికి ‘మార్గ్‌మిత్ర’ (MargMitra) అనే సరికొత్త హెల్ప్ సెంటర్‌ను కూడా NHAI ఈ రాజ్‌మార్గ్‌ యాత్ర యాప్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఒక వర్చువల్ అసిస్టెంట్ ప్లాట్‌ఫామ్. తెలుగు సహా ఎన్నో ప్రధాన భారతీయ భాషల్లో ప్రయాణికులకు టెక్స్ట్ లేదా వాయిస్ ద్వారా ఇది అసిస్టెన్స్ అందిస్తుంది. ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ చేసుకోవడం, కేవైసీ (KYC) స్టేటస్ చెక్ చేయడం, బ్లాక్‌లిస్ట్ స్టేటస్ చూడటం, పాస్‌లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం వంటి ఎన్నో సేవలను దీని ద్వారా పొందవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 July 2026, 9:35 pm Digital Edition : Prabhanews
NHAI Rajmarg Yatra app: హైవే ప్రయాణికులకు శుభవార్త.. యాప్ ద్వారా ‘డిజిటల్ లోకల్ టోల్ పాస్’ సేవలు | బిజినెస్

ఎవరికి వర్తిస్తుంది? ప్రయోజనాలు ఏమిటి?:ఈ కొత్త డిజిటల్ పాస్ విధానం ముఖ్యంగా టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానిక ప్రజల కోసం ప్రత్యేకంగా రూపొందించినది. ఈ నిర్దేశిత పరిధిలో నివసిస్తూ, ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్-కమర్షియల్ వాహనాలు కలిగి ఉన్న యజమానులు ఈ నెలవారీ లోకల్ పాస్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఒక్కసారి యాప్ ద్వారా పాస్ మంజూరైతే, వారు ఆ సంబంధిత టోల్ ప్లాజా ద్వారా ఒక నెల పాటు అపరిమితంగా ఉచిత ప్రయాణం చేసే సదుపాయం లభిస్తుంది.ఇవి కూడా చదవండి: Black Hole: మూడోసారి పేలిన బ్లాక్ హోల్.. విచిత్ర ప్రవర్తన చూసి షాకైన శాస్త్రవేత్తలు.. భూమికి ప్రమాదమా?ఇదివరకు ఈ లోకల్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవడమే కష్టంగా ఉండేది. ప్రయాణికులు తమ ఇంటి ధృవీకరణ పత్రాలు, వాహన రిజిస్ట్రేషన్ (RC), ఆధార్ కార్డ్ వంటి ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్ల కాపీలను తీసుకుని, వ్యక్తిగతంగా టోల్ ప్లాజా కార్యాలయానికి వెళ్లి సమర్పించాల్సి వచ్చేది. అక్కడ సిబ్బంది ఆ పత్రాలను పరిశీలించి, మ్యాన్యువల్‌గా డేటా ఎంట్రీ చేసిన తర్వాతే పాస్ ఇచ్చేవారు. దీనివల్ల టైమ్ వేస్ట్ అయ్యేది, టోల్ గేట్ల దగ్గర రద్దీ పెరిగేది. ఇప్పుడు ఆ ఆఫ్‌లైన్ విధానానికి పూర్తిగా స్వస్తి చెబుతూ, స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంటి నుంచే కొన్ని నిమిషాల్లోనే దరఖాస్తు చేసుకునే వీలుంది.టెక్నాలజీ - వెరిఫికేషన్ ప్రక్రియ:ఈ పాస్ జారీ ప్రక్రియను అత్యంత సురక్షితంగా నిర్వహించేందుకు NHAI ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థలను రాజ్‌మార్గ్‌ యాత్ర యాప్‌తో లింక్ చేసింది. దరఖాస్తుదారు యాప్‌లో తన సమ్మతి ఇచ్చిన వెంటనే, సిస్టమ్ ఆటోమేటిక్‌గా డిజిలాకర్ (DigiLocker) ద్వారా చిరునామా వివరాల్ని సేకరిస్తుంది. అలాగే, వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాల్నీ, యాక్టివ్‌గా ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) సమాచారాన్నీ.. ప్రభుత్వ వాహన్ (VAHAN) డేటాబేస్ ద్వారా తక్షణమే ధృవీకరిస్తుంది. అంతేకాకుండా, దరఖాస్తుదారు నిజంగా ఆ 20 కిలోమీటర్ల పరిధిలోనే నివసిస్తున్నారా లేదా అని నిర్ధారించడానికి భౌగోళిక సమాచార వ్యవస్థ (GIS) ఆధారిత లొకేషన్ వెరిఫికేషన్ టెక్నాలజీని వాడుతుంది. దీనివల్ల ఎలాంటి కాగితపు పత్రాల అవసరం ఉండదు, పైగా తప్పుడు దరఖాస్తులకు ఛాన్స్ లేకుండా పాస్ ఆమోద ప్రక్రియ వేగంగా జరుగుతుంది.ప్రస్తుతానికి ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ సేవలను ఢిల్లీలోని అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్ (UER) పై ఉన్న ముండ్కా-బక్కర్వాలా టోల్ ప్లాజా దగ్గర మాత్రమే ప్రారంభించారు. ఇక్కడ వచ్చే ప్రజల స్పందన, టెక్నాలజీ పనితీరును పూర్తిగా విశ్లేషించిన తర్వాత, రానున్న నెలల్లో దేశవ్యాప్తంగా అర్హత కలిగిన ఇతర టోల్ ప్లాజాలన్నింటికీ ఈ డిజిటల్ లోకల్ పాస్ సేవలను దశలవారీగా విస్తరిస్తామని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.'మార్గ్‌మిత్ర' రూపంలో వర్చువల్ సహాయం:ఈ డిజిటల్ పాస్ సేవలతో పాటుగా, ప్రయాణికుల సందేహాలను ఎప్పటికప్పుడు తీర్చడానికి 'మార్గ్‌మిత్ర' (MargMitra) అనే సరికొత్త హెల్ప్ సెంటర్‌ను కూడా NHAI ఈ రాజ్‌మార్గ్‌ యాత్ర యాప్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఒక వర్చువల్ అసిస్టెంట్ ప్లాట్‌ఫామ్. తెలుగు సహా ఎన్నో ప్రధాన భారతీయ భాషల్లో ప్రయాణికులకు టెక్స్ట్ లేదా వాయిస్ ద్వారా ఇది అసిస్టెన్స్ అందిస్తుంది. ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ చేసుకోవడం, కేవైసీ (KYC) స్టేటస్ చెక్ చేయడం, బ్లాక్‌లిస్ట్ స్టేటస్ చూడటం, పాస్‌లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం వంటి ఎన్నో సేవలను దీని ద్వారా పొందవచ్చు.

Source link