ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు ఇందులో విటమిన్-B12 కూడా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్-A, కాల్షియం, ఫాస్ఫరస్ కూడా ఉంటాయి. ఇవన్నీ దంతాలు, ఎముకలను బలపరిచి, వాటి ఆరోగ్యాన్ని కాపాడటానికి దోహదపడతాయి. అంతేకాకుండా సెలీనియం వంటి పోషకాలు చర్మ కాంతిని పెంచడానికి,చర్మ సమస్యలను నివారించడానికి సహాయపడతాయి.

