Last Updated:
Navratri 2026: శారదీయ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాత్యాయని అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు సమర్పించిన ఆయన అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో అపరిమితమైన శక్తి, ధైర్యం, సకారాత్మక శక్తి నిండాలని ఆకాంక్షించారు. ఈవిషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు.
Navratri 2026: శారదీయ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాత్యాయని అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు సమర్పించిన ఆయన అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో అపరిమితమైన శక్తి, ధైర్యం, సకారాత్మక శక్తి నిండాలని ఆకాంక్షించారు. ఈవిషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు ప్రజలు. ఈ నవరాత్రుల పవిత్రమైన ఆరవ రోజున కాత్యాయని అమ్మవారి దివ్య పాద పద్మాలకు కోట్లాది నమస్కారాలు అంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పూజించారు. అమ్మవారి కృపతో ప్రతి ఒక్కరి జీవితాల్లో అపరిమితమైన ధైర్యం, సామర్థ్యం, సానుకూల శక్తి నిండాలని నా హృదయపూర్వక ఆకాంక్షిస్తున్నట్లుగా ప్రధాని మోదీ సోషల్ మీడియా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.
तव च का किल न स्तुतिरम्बिके! सकलशब्दमयी किल ते तनुः।
निखिलमूर्तिषु मे भवदन्वयो मनसिजासु बहिःप्रसरासु च॥ https://t.co/gh1E9Ylz9h— Narendra Modi (@narendramodi) October 16, 2026
ఈ సందర్భంగా మాధవి మధుకర్ ఝా ఆలపించిన ‘భవాని అష్టకం’ దుర్గాదేవి భక్తిగీతం యూట్యూబ్ లింక్‌ను కూడా ప్రధాని పంచుకున్నారు. అంతేకాకుండా జగదంబికా అమ్మవారి దివ్యత్వాన్ని, మాటలు, ఆలోచనలు, రూపాలలో దేవి ఉనికిని వివరించే ఒక సంస్కృత శ్లోకాన్ని ప్రధాని ఈ సందర్భంగా షేర్ చేశారు.
“ఓ జగదంబికా అమ్మా! ఈ ప్రపంచంలో నీకు స్తుతిగా లేని మాట ఏదైనా ఉందా? ఎందుకంటే నీ స్వరూపమే సర్వ శబ్దమయం. ఓ దేవీ! నా మనసులో మెదిలే ప్రతి ఆలోచనలోనూ వెలుపల కనిపించే ప్రతి రూపంలోనూ నీ దివ్య రూపాన్నే నేను దర్శిస్తున్నాను” అని ఆ శ్లోకం భావాన్ని పేర్కొన్నారు మోదీ.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “శారదీయ నవరాత్రుల ఆరవ రోజున ఆదిశక్తి దుర్గాదేవి ఆరవ రూపమైన కాత్యాయని అమ్మవారి చరణ కమలాలకు కోట్లాది ప్రణామాలు. మహిషాసురుడిని సంహరించి, ధర్మం , సత్యాల విజయాన్ని చాటిచెప్పిన కాత్యాయని అమ్మవారి దివ్య రూపం.. మన సంకల్పానికి శక్తి, నడిపించే ధర్మం తోడైతే ఎలాంటి పెద్ద అడ్డంకినైనా అధిగమించవచ్చని గుర్తుచేస్తోందని రేఖా గుప్తా పేర్కొన్నారు.
“ఢిల్లీలోని ప్రతి కుటుంబంలోనూ ఆనందం, శాంతి, సమృద్ధి నిండాలని భాగవతీ అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లుగా పోస్టు ద్వారా తెలిపారు. మన రాజధానికి ఏ సవాలునైనా ఎదుర్కొనే శక్తి లభించాలని, సేవ, భద్రత, సుపరిపాలన , అభివృద్ధి బాటలో ఢిల్లీ నిరంతరం ముందుకు సాగాలని కోరుకుంటున్నానని తెలుపుతూ జై కాత్యాయని మా” అని ఆమె కామెంట్ పెట్టారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా శారదీయ నవరాత్రుల ఆరవ రోజు సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. “శారదీయ నవరాత్రుల ఆరవ రోజున ఆదిశక్తి జగదంబ ఆరవ రూపమైన కాత్యాయని అమ్మవారి పాదాలకు అనంత ప్రణామాలు. ధర్మ రక్షణ సందేశాన్ని అందించే కాత్యాయని దేవిని ప్రార్థిస్తూ.. అమ్మవారి అనుగ్రహంతో భక్తులందరూ తమ సంకల్పాలను నెరవేర్చుకునే ధైర్యం, బలాన్ని పొందాలని కోరుకుంటున్నాను. జై కాత్యాయని మా” అని సీఎం యోగి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

