Last Updated:
ప్రముఖ నటుడు నానా పటేకర్ ఆకస్మిక మరణంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నానా పటేకర్ మృతి తనను ఎంతగానో కలచివేసిందని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపాడు.
ప్రముఖ నటుడు నానా పటేకర్ ఆకస్మిక మరణంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నానా పటేకర్ మృతి తనను ఎంతగానో కలచివేసిందని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపాడు.
ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో పూర్తిగా ఒదిగిపోయే గొప్ప నటుడు నానా పటేకర్ అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ముఖ్యంగా ‘క్రాంతివీర్’ సినిమాలో ఆయన నటనను ఎప్పటికీ మరచిపోలేమని పేర్కొన్నాడు. నానా పటేకర్ తన విలక్షణమైన నటనతో భారతీయ సినీ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారని తెలిపారు.
‘పరిందా’, ‘ఖామోషీ’, ‘తిరంగా’, ‘అగ్నిసాక్షి’, ‘నటసామ్రాట్’, ‘అబ్ తక్ చప్పన్’, ‘అపహరణ్’ వంటి సినిమాలు ఆయన సుదీర్ఘ నట జీవితంలో ప్రత్యేకంగా నిలిచిపోయిన సినిమాలని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుని వాటికి తనదైన శైలిలో ప్రాణం పోసిన నానా పటేకర్ భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. సినిమా రంగంలోనే కాకుండా భారత సైన్యంలోనూ నానా పటేకర్ గౌరవపూర్వకంగా సేవలందించారని పవన్ కళ్యాణ్ తన సంతాప సందేశంలో ప్రస్తావించారు. దేశం పట్ల ఆయనకున్న గౌరవం, సేవాభావాన్ని గుర్తుచేసుకున్నాడు.
నానా పటేకర్ మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఒక ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోయిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో నానా పటేకర్ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నాను అంటూ ఎమోషనల్‌గా స్పందించాడు.
నానా పాటేకర్ కార్డియాక్ అరెస్ట్‌తో 75 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచాడు. గోవాలోని తన ఇంట్లో ఒక్కసారిగా గుండెపోటుకు గురైన ఆయనను తన ఫ్యామిలీ.. వెంటనే దోనా పౌలా ఏరియాలోని ఓ ప్రైవేల్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స జరుగుతుండగానే ఆయన చనిపోయారు. నానా పటేకర్ ఈ రోజు తెల్లవారుజామున 5:20 నిమిషాలకు చనిపోయినట్లు తెలుస్తుంది. ఆయన మరణ వార్తతో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
నానా పటేకర్ భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. హిందీతో పాటు మరాఠీ సినిమాల్లోనూ తన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విలన్ పాత్రల నుంచి హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు విభిన్నమైన పాత్రలను తనదైన శైలిలో పోషించారు.

