ప్రభన్యూస్

Naga Durga: అప్పుడే ఓటీటీలోకి ఫోక్ సింగర్ నాగదుర్గ కొత్త సినిమా.. ఎందులో అంటే? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్, సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది నాగదుర్గ. తన అందం డ్యాన్స్ అభినయంతో తక్కువ సమయంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది.

News18
News18

తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్, సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది నాగదుర్గ. తన అందం డ్యాన్స్ అభినయంతో తక్కువ సమయంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. వందలాది ఫోక్ సాంగ్స్‌లో నటించి ప్రత్యేక గుర్తింపు పొందిన ఆమె ఇప్పుడు హీరోయిన్‌గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పటికే ‘కవలి వనం’ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన నాగదుర్గ ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతోంది.

గతేడాది విడుదలైన ‘కవలి వనం’ సినిమా పెద్దగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. అయినా నాగదుర్గకు మాత్రం కొత్త అవకాశాల తలుపులు తెరిచింది. ప్రస్తుతం యంగ్ హీరో ప్రియదర్శితో కలిసి ‘ఇడుపు కాయితం’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి.

ఇదిలా ఉంటే తెలుగులో కంటే ముందే నాగదుర్గ తమిళ చిత్రసీమలో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవిష్ సరసన ‘లవ్ ఓ లవ్’ సినిమాలో నటించింది. ఈ సినిమా జూలై 10న తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలైంది. కొత్త జంట నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా నాగదుర్గ తన సహజ నటనతో ఆకట్టుకుందని సినీ అభిమానులు ప్రశంసించారు.

సినిమాకు విమర్శకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. మిశ్రమ స్పందన కారణంగా థియేటర్లలో ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. అయితే ఇప్పుడు ఓటీటీ ద్వారా మరింత మంది ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

లవ్ ఓ లవ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా జూలై 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఒకేసారి అందుబాటులోకి తీసుకురానున్నారు. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులకు ఇది మంచి అవకాశం కానుంది.

ఈ సినిమా కథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. రఘు పాత్రలో పవిష్ కనిపిస్తే అవంతిక పాత్రలో నాగదుర్గ నటించింది. ప్రేమలో పడిన తర్వాత అవంతిక కోసం రఘు తన సంపాదించిన డబ్బంతా ఖర్చు చేస్తుంటాడు. సినిమాలు షాపింగ్ ట్రిప్స్ అంటూ అతని చేత భారీగా ఖర్చు చేయిస్తుంది. పరిస్థితి మరింత దిగజారి రఘు అప్పులు చేసి క్రెడిట్ కార్డులపై కూడా ఆధారపడాల్సి వస్తుంది.

చివరకు ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు చేరుతుంది. అక్కడ రఘు తమ ప్రేమకు ముగింపు పలకాలంటే అవంతిక ఒక లెటర్‌పై సంతకం చేయాలని చెబుతాడు. లేదంటే నాలుగు నెలల పాటు తన స్థానంలో ఉండి తాను ఎదుర్కొన్న ప్రతి సమస్యను ఎదుర్కోవాలని షరతు పెడతాడు. అందుకు అవంతిక అంగీకరిస్తుంది. ఆ తర్వాత ఆమె జీవితం ఎలా మారింది. రఘు తీసుకున్న నిర్ణయం సరైందా కాదా. చివరకు ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారా లేదా అనే అంశాల చుట్టూ సినిమా సాగుతుంది.

ఫోక్ సాంగ్స్‌తో పాపులర్ అయిన నాగదుర్గ ఇప్పుడు హీరోయిన్‌గా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఓటీటీలో లవ్ ఓ లవ్ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 9:41 pm Digital Edition : Prabhanews
Naga Durga: అప్పుడే ఓటీటీలోకి ఫోక్ సింగర్ నాగదుర్గ కొత్త సినిమా.. ఎందులో అంటే? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 24, 2026 9:29 PM ISTతెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్, సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది నాగదుర్గ. తన అందం డ్యాన్స్ అభినయంతో తక్కువ సమయంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. News18తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్, సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది నాగదుర్గ. తన అందం డ్యాన్స్ అభినయంతో తక్కువ సమయంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. వందలాది ఫోక్ సాంగ్స్‌లో నటించి ప్రత్యేక గుర్తింపు పొందిన ఆమె ఇప్పుడు హీరోయిన్‌గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పటికే 'కవలి వనం' సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన నాగదుర్గ ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతోంది.గతేడాది విడుదలైన 'కవలి వనం' సినిమా పెద్దగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. అయినా నాగదుర్గకు మాత్రం కొత్త అవకాశాల తలుపులు తెరిచింది. ప్రస్తుతం యంగ్ హీరో ప్రియదర్శితో కలిసి 'ఇడుపు కాయితం' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి.ఇదిలా ఉంటే తెలుగులో కంటే ముందే నాగదుర్గ తమిళ చిత్రసీమలో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవిష్ సరసన 'లవ్ ఓ లవ్' సినిమాలో నటించింది. ఈ సినిమా జూలై 10న తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలైంది. కొత్త జంట నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా నాగదుర్గ తన సహజ నటనతో ఆకట్టుకుందని సినీ అభిమానులు ప్రశంసించారు.సినిమాకు విమర్శకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. మిశ్రమ స్పందన కారణంగా థియేటర్లలో ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. అయితే ఇప్పుడు ఓటీటీ ద్వారా మరింత మంది ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.లవ్ ఓ లవ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా జూలై 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఒకేసారి అందుబాటులోకి తీసుకురానున్నారు. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులకు ఇది మంచి అవకాశం కానుంది.ఈ సినిమా కథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. రఘు పాత్రలో పవిష్ కనిపిస్తే అవంతిక పాత్రలో నాగదుర్గ నటించింది. ప్రేమలో పడిన తర్వాత అవంతిక కోసం రఘు తన సంపాదించిన డబ్బంతా ఖర్చు చేస్తుంటాడు. సినిమాలు షాపింగ్ ట్రిప్స్ అంటూ అతని చేత భారీగా ఖర్చు చేయిస్తుంది. పరిస్థితి మరింత దిగజారి రఘు అప్పులు చేసి క్రెడిట్ కార్డులపై కూడా ఆధారపడాల్సి వస్తుంది.చివరకు ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు చేరుతుంది. అక్కడ రఘు తమ ప్రేమకు ముగింపు పలకాలంటే అవంతిక ఒక లెటర్‌పై సంతకం చేయాలని చెబుతాడు. లేదంటే నాలుగు నెలల పాటు తన స్థానంలో ఉండి తాను ఎదుర్కొన్న ప్రతి సమస్యను ఎదుర్కోవాలని షరతు పెడతాడు. అందుకు అవంతిక అంగీకరిస్తుంది. ఆ తర్వాత ఆమె జీవితం ఎలా మారింది. రఘు తీసుకున్న నిర్ణయం సరైందా కాదా. చివరకు ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారా లేదా అనే అంశాల చుట్టూ సినిమా సాగుతుంది.ఫోక్ సాంగ్స్‌తో పాపులర్ అయిన నాగదుర్గ ఇప్పుడు హీరోయిన్‌గా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఓటీటీలో లవ్ ఓ లవ్ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link