1930కి కాల్ చేయడం మర్చిపోవద్దు: బ్యాంక్‌కు సమాచారం ఇవ్వడంతో పాటు జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కూడా కాల్ చేయండి. ముఖ్యంగా మీ ఖాతా నుంచి మరో ఖాతాకు డబ్బులు బదిలీ అయినప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే, ఆ డబ్బులు మరోచోటికి బదిలీ కాకముందే వాటిని నిలిపివేసే అవకాశం ఉండొచ్చు. ప్రభుత్వానికి చెందిన నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీని కోసం మరుసటి రోజు వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఫిర్యాదు చేసేటప్పుడు ఉపయోగపడేందుకు లావాదేవీ ఐడీ, డబ్బుల మొత్తం, లావాదేవీ జరిగిన తేదీ, బ్యాంక్ నుంచి వచ్చిన మెసేజ్‌లు వంటి వివరాలను దగ్గర ఉంచుకోండి. ఫిర్యాదు నమోదు చేసేటప్పుడు ఇవి ఉపయోగపడతాయి. (ప్రతీకాత్మక చిత్రం)

