ఇక పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ చెబుతున్న ప్రకారం 2026 సెప్టెంబర్ 19 నాటికి 27.43 కోట్ల యాక్టివ్ డొమెస్టిక్ ఎల్పీజీ వినియోగదారులు బీఏఏ పూర్తి చేశారు. ఇది మొత్తం వినియోగదారుల్లో 89.9 శాతం. మొదట బీఏఏ పూర్తి చేయడానికి జూన్ 30 వరకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత గడువును పలుమార్లు పొడిగించారు. జూలై 31, ఆగస్టు 7, ఆగస్టు 15, ఆగస్టు 23, ఆగస్టు 31, సెప్టెంబర్ 7 తేదీల వరకు గడువు పెంచారు. చివరగా 2026 సెప్టెంబర్ 14 వరకు అవకాశం ఇచ్చారు. 2023 అక్టోబర్ నుంచి ఓఎంసీలు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు 12 కోట్లకు పైగా ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజ్లు పంపించారు. బీఏఏ పూర్తి చేయని వినియోగదారులను డిస్ట్రిబ్యూటర్లు, డెలివరీ సిబ్బంది వ్యక్తిగతంగా కూడా సంప్రదించారు. (ప్రతీకాత్మక చిత్రం)

