దేశంలో ఎల్పీజీ (LPG) వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందించే దిశగా ప్రభుత్వ చమురు సంస్థలు కొత్త ఆలోచనపై ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, వీధి ఆహార విక్రేతలు, అద్దె ఇళ్లలో నివసించే వారు, విద్యార్థులు, వలస కార్మికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్కువ బరువుతో, సులభంగా మోయగలిగే కొత్త ఎల్పీజీ సిలిండర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నాయి. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం 19 కిలోల బరువైన కమర్షియల్ సిలిండర్‌ను మోయడంలో ఇబ్బంది పడుతున్న వారికి ఉపశమనం లభించే అవకాశం ఉంది.

