Last Updated:
LIC Policy: మీరు LIC పాలసీ తీసుకుని మధ్యలో ప్రీమియం చెల్లించడం ఆపేశారా? ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర కారణాలతో ప్రీమియం కట్టకపోవడంతో మీ బీమా పాలసీ ల్యాప్స్ అయిందా? అలాంటి పాలసీదారులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మంచి అవకాశం కల్పిస్తోంది.
జీవిత బీమా పాలసీ తీసుకున్న తర్వాత ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో కొంతమంది సకాలంలో ప్రీమియం చెల్లించలేకపోతుంటారు. దీంతో వారి బీమా పాలసీలు ల్యాప్స్ అవుతుంటాయి. అలాంటి పాలసీదారులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఒక మంచి అవకాశం కల్పిస్తోంది. ల్యాప్స్ అయిన అర్హత కలిగిన పాలసీలను తిరిగి యాక్టివేట్ చేసుకునేందుకు ప్రత్యేక రివైవల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా ఆలస్యంగా ప్రీమియం చెల్లించినందుకు విధించే లేట్ ఫీజుపై 20 శాతం రాయితీ అందిస్తోంది.
LIC ప్రకటించిన స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్ 2026 డిసెంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది. అంటే ల్యాప్స్ అయిన పాలసీలను తిరిగి కొనసాగించాలని అనుకునే వారికి ఈ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా లేట్ ఫీజుపై 20 శాతం రాయితీ ఇస్తున్నారు. అయితే ఈ రాయితీ గరిష్టంగా రూ.3,000 వరకు మాత్రమే ఉంటుంది. పాలసీదారులు చెల్లించాల్సిన లేట్ ఫీజు ఆధారంగా ఈ తగ్గింపు వర్తిస్తుంది.
Give your lapsed LIC policy a new lease of life with a 20% concession on late fees, up to ₹3,000.
Revive your policy before 15th December 2026!
#LIC #SpecialRevivalCampaign https://t.co/XUfGQIkt11— LIC India Forever (@LICIndiaForever) November 22, 2026
LIC ప్రకటన ప్రకారం.. మొదటి ప్రీమియం చెల్లించాల్సిన తేదీ నుంచి ఆరు నెలలకు మించి గడిచినా ప్రీమియం చెల్లించకపోవడంతో ల్యాప్స్ అయిన సంప్రదాయ బీమా పాలసీలకు ఈ రాయితీ వర్తిస్తుంది. అంటే ఆరు నెలలకు మించి ప్రీమియం బకాయి ఉన్న అర్హులైన సంప్రదాయ పాలసీదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే అన్ని రకాల పాలసీలకు ఈ ప్రయోజనం వర్తిస్తుందని భావించకూడదు. సంబంధిత పాలసీ నిబంధనలను పరిశీలించాలి. మొదటి ప్రీమియం చెల్లించని తేదీ నుంచి ఐదేళ్లలోపు పాలసీలను తిరిగి పునరుద్ధరించుకునే అవకాశం ఉందని LIC వెల్లడించింది. అయితే ఇది సంబంధిత బీమా ప్లాన్ నిబంధనలకు లోబడి ఉంటుంది. కాబట్టి తమ పాలసీ రివైవల్‌కు అర్హత పొందుతుందో లేదో ముందుగా తెలుసుకోవాలి.
ల్యాప్స్ అయిన పాలసీని తిరిగి యాక్టివేట్ చేసుకోవాలనుకునే వారు తమ LIC ఏజెంట్‌ను లేదా సమీపంలోని LIC బ్రాంచ్‌ను సంప్రదించవచ్చు. అలాగే LIC అధికారిక వెబ్‌సైట్ www.licindia.in ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. My LIC యాప్‌లోనూ పాలసీ సేవలను పొందే అవకాశం ఉంది. డిసెంబర్ 15 చివరి తేదీ కావడంతో అర్హత ఉన్నవారు ముందుగానే వివరాలు తెలుసుకుని ప్రక్రియ పూర్తి చేసుకోవడం మంచిది. ఇక్కడే గుర్తించుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. 20 శాతం లేట్ ఫీజు రాయితీ గరిష్టంగా రూ.3,000 వరకు మాత్రమే. పాలసీ పునరుద్ధరణకు సంబంధించిన పూర్తి అర్హతలు, ఇతర నిబంధనలను LIC అధికారికంగా నిర్ధారించుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి.

