ప్రభన్యూస్

Kriti Sanon: పెళ్లి, పిల్లలపై క్రితి సనన్ ఊహించని ట్విస్ట్.. ఆ ట్రీట్‌మెంట్ చేయించుకున్నట్లు ఓపెన్ స్టేట్‌మెంట్! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

పెళ్లి, మాతృత్వంపై సమాజం ఒత్తిడి చేయకూడదని బాలీవుడ్ నటి కృతి సనన్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు కోసం తాను ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నట్లు వెల్లడిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

News18
News18

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం 35 ఏళ్ల వయసున్న ఈ నటి తాను ఇప్పటికే ఎగ్ ఫ్రీజింగ్ (అండాలను భద్రపరచడం) చేయించుకున్నట్లు చెప్పింది. పెళ్లి, మాతృత్వం వంటి నిర్ణయాలు సమాజం ఒత్తిడితో కాకుండా, వ్యక్తిగతంగా సిద్ధమైనప్పుడు తీసుకోవాలని ఆమె అభిప్రాయపడింది.

తాజా ఇంటర్వ్యూలో కృతి మాట్లాడుతూ.. “నేను నా అండాలను ఫ్రీజ్ చేయించుకున్నాను. వెంటనే పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కనాలి అనే ఒత్తిడి నాకు లేదు. నాకు సరైన సమయం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటాను” అని తెలిపింది.

పెళ్లి, పిల్లల విషయంలో ప్రతి ఒక్కరూ తమ జీవిత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించింది. “ఇతరుల ఒత్తిడి వల్ల జీవితంలో ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. మనం మానసికంగా, వ్యక్తిగతంగా సిద్ధమైనప్పుడు మాత్రమే ఆ నిర్ణయం తీసుకోవాలి. చాలా మందికి ఈ అవకాశం ఉండదు. నాకు ఆ అవకాశం ఉంది కాబట్టే నేను ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నాను” అని చెప్పింది.

అలాగే ఈ ప్రక్రియకు తాను సరైన సమయాన్నే ఎంచుకున్నానని కృతి వెల్లడించింది. “‘మిమి’ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు ఈ చికిత్స చేయించుకున్నాను. ఆ సినిమా కోసం బరువు పెరగాల్సి వచ్చింది. అప్పట్లో రెండు నెలల పాటు షూటింగ్ కూడా లేకపోవడంతో అదే సమయంలో ఈ ప్రక్రియ పూర్తి చేశాను” అని వివరించింది.

ఈ నిర్ణయం గురించి చాలామంది తనను అభినందించారని కూడా కృతి తెలిపింది. “ఇది నీ జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం. నీకు నువ్వే ఇచ్చుకున్న గొప్ప బహుమతి ఇదే” అని చాలా మంది తనను ప్రశంసించారని చెప్పింది.

అయితే ఎగ్ ఫ్రీజింగ్ అనేది అంత సులభమైన ప్రక్రియ కాదని కూడా ఆమె స్పష్టం చేసింది. “దీనికి ఆర్థికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలి. చికిత్స సమయంలో హార్మోన్లలో మార్పులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో గర్భిణిలా అనిపిస్తుంది. మానసిక స్థితిలో కూడా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అయినప్పటికీ నేను ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది సులభమైన ప్రక్రియ కాకపోయినా భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయం” అని కృతి వెల్లడించింది.

కృతి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళలు తమ కెరీర్, వ్యక్తిగత జీవితం, మాతృత్వం మధ్య సమతుల్యత సాధించేందుకు ఎగ్ ఫ్రీజింగ్ వంటి ఆధునిక వైద్య విధానాలను ఉపయోగించుకోవడం గురించి ఆమె చెప్పిన మాటలు విస్తృత చర్చకు దారితీశాయి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 July 2026, 9:24 pm Digital Edition : Prabhanews
Kriti Sanon: పెళ్లి, పిల్లలపై క్రితి సనన్ ఊహించని ట్విస్ట్.. ఆ ట్రీట్‌మెంట్ చేయించుకున్నట్లు ఓపెన్ స్టేట్‌మెంట్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 08, 2026 8:56 PM ISTపెళ్లి, మాతృత్వంపై సమాజం ఒత్తిడి చేయకూడదని బాలీవుడ్ నటి కృతి సనన్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు కోసం తాను ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నట్లు వెల్లడిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
News18బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం 35 ఏళ్ల వయసున్న ఈ నటి తాను ఇప్పటికే ఎగ్ ఫ్రీజింగ్ (అండాలను భద్రపరచడం) చేయించుకున్నట్లు చెప్పింది. పెళ్లి, మాతృత్వం వంటి నిర్ణయాలు సమాజం ఒత్తిడితో కాకుండా, వ్యక్తిగతంగా సిద్ధమైనప్పుడు తీసుకోవాలని ఆమె అభిప్రాయపడింది.తాజా ఇంటర్వ్యూలో కృతి మాట్లాడుతూ.. "నేను నా అండాలను ఫ్రీజ్ చేయించుకున్నాను. వెంటనే పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కనాలి అనే ఒత్తిడి నాకు లేదు. నాకు సరైన సమయం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటాను" అని తెలిపింది.పెళ్లి, పిల్లల విషయంలో ప్రతి ఒక్కరూ తమ జీవిత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించింది. "ఇతరుల ఒత్తిడి వల్ల జీవితంలో ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. మనం మానసికంగా, వ్యక్తిగతంగా సిద్ధమైనప్పుడు మాత్రమే ఆ నిర్ణయం తీసుకోవాలి. చాలా మందికి ఈ అవకాశం ఉండదు. నాకు ఆ అవకాశం ఉంది కాబట్టే నేను ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నాను" అని చెప్పింది.అలాగే ఈ ప్రక్రియకు తాను సరైన సమయాన్నే ఎంచుకున్నానని కృతి వెల్లడించింది. "'మిమి' సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు ఈ చికిత్స చేయించుకున్నాను. ఆ సినిమా కోసం బరువు పెరగాల్సి వచ్చింది. అప్పట్లో రెండు నెలల పాటు షూటింగ్ కూడా లేకపోవడంతో అదే సమయంలో ఈ ప్రక్రియ పూర్తి చేశాను" అని వివరించింది.ఈ నిర్ణయం గురించి చాలామంది తనను అభినందించారని కూడా కృతి తెలిపింది. "ఇది నీ జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం. నీకు నువ్వే ఇచ్చుకున్న గొప్ప బహుమతి ఇదే" అని చాలా మంది తనను ప్రశంసించారని చెప్పింది.అయితే ఎగ్ ఫ్రీజింగ్ అనేది అంత సులభమైన ప్రక్రియ కాదని కూడా ఆమె స్పష్టం చేసింది. "దీనికి ఆర్థికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలి. చికిత్స సమయంలో హార్మోన్లలో మార్పులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో గర్భిణిలా అనిపిస్తుంది. మానసిక స్థితిలో కూడా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అయినప్పటికీ నేను ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది సులభమైన ప్రక్రియ కాకపోయినా భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయం" అని కృతి వెల్లడించింది.కృతి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళలు తమ కెరీర్, వ్యక్తిగత జీవితం, మాతృత్వం మధ్య సమతుల్యత సాధించేందుకు ఎగ్ ఫ్రీజింగ్ వంటి ఆధునిక వైద్య విధానాలను ఉపయోగించుకోవడం గురించి ఆమె చెప్పిన మాటలు విస్తృత చర్చకు దారితీశాయి.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link