ప్రభన్యూస్

Kothimeera Chicken Fry: నోరూరించే కొత్తిమీర చికెన్ ఫ్రై! ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది! | లైఫ్ స్టైల్


కావలసిన పదార్థాలు….

చికెన్: అర కిలో (చిన్న ముక్కలు)

నూనె: 3-4 పెద్ద చెంచాలు

ఉల్లిపాయలు: 1 పెద్దది (సన్నటి తరుగు)

కరివేపాకు: 2 రెమ్మలు

పసుపు: పావు చిన్న చెంచా

ధనియాల పొడి: 1 చిన్న చెంచా

గరం మసాలా పొడి: అర చిన్న చెంచా

మిరియాల పొడి: అర చిన్న చెంచా

నిమ్మరసం: 1 పెద్ద చెంచా

ఉప్పు: రుచికి సరిపడా

కొత్తిమీర మసాలా పేస్ట్ కోసం (మిక్సీ పట్టుకోవాలి):

కొత్తిమీర: 1 పెద్ద కట్ట (కాడలతో సహా శుభ్రం చేసినది)

పచ్చిమిరపకాయలు: 5-6 (కారం తగ్గట్టుగా)

అల్లం: 1 అంగుళం ముక్క

వెల్లుల్లి రెబ్బలు: 10-12

పుదీనా ఆకులు: గుప్పెడు

జీలకర్ర: 1 చిన్న చెంచా

లవంగాలు: 3

దాల్చిన చెక్క: 1 చిన్న ముక్క

తయారీ విధానం…

మిక్సీ జార్‌లో కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క వేసి, అవసరమైతే ఒక్క చెంచా నీళ్లు పోసి మెత్తటి ముద్దలా రుబ్బుకోండి. శుభ్రం చేసిన చికెన్ ముక్కల్లో రుబ్బుకున్న కొత్తిమీర ముద్ద, పసుపు, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి కనీసం 20-30 నిమిషాలు పక్కన ఉంచండి. ఒక మందపాటి బాణలిలో నూనె వేడి చేసి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేంతవరకు వేయించండి. ఉల్లిపాయలు వేగాక, మ్యారినేట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చికెన్ ముక్కలను నూనెలో వేయండి. మంటను మీడియం-హైలో ఉంచి 3-4 నిమిషాలు బాగా వేపండి. ఆ తర్వాత మూతపెట్టి చిన్న మంటపై ముక్కల్లోని నీరు బయటకు వచ్చి ముక్క మెత్తబడే వరకు (సుమారు 10-12 నిమిషాలు) మగ్గనివ్వండి. చికెన్ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత మూత తీసి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, మిరియాల పొడి వేసి బాగా కలపండి. మంటను మీడియంలో ఉంచి చికెన్‌లోని తేమ అంతా ఇంకిపోయి, మసాలా మొత్తం ముక్కలకు పట్టి నూనె పైకి తేలేవరకు అట్లకాడతో కలుపుతూ వేయించండి. చివరగా పచ్చి కొత్తిమీర చల్లుకుని స్టవ్ కట్టేయండి. ఘుమఘుమలాడే కొత్తిమీర చికెన్ ఫ్రై సిద్ధం.

నిమ్మకాయ రసం పిండుకుని ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే రుచి అదిరిపోతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 October 2026, 1:08 pm Digital Edition : Prabhanews
Kothimeera Chicken Fry: నోరూరించే కొత్తిమీర చికెన్ ఫ్రై! ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది! | లైఫ్ స్టైల్

కావలసిన పదార్థాలు....చికెన్: అర కిలో (చిన్న ముక్కలు)నూనె: 3-4 పెద్ద చెంచాలుఉల్లిపాయలు: 1 పెద్దది (సన్నటి తరుగు)కరివేపాకు: 2 రెమ్మలుపసుపు: పావు చిన్న చెంచాధనియాల పొడి: 1 చిన్న చెంచాగరం మసాలా పొడి: అర చిన్న చెంచామిరియాల పొడి: అర చిన్న చెంచానిమ్మరసం: 1 పెద్ద చెంచాఉప్పు: రుచికి సరిపడాకొత్తిమీర మసాలా పేస్ట్ కోసం (మిక్సీ పట్టుకోవాలి):కొత్తిమీర: 1 పెద్ద కట్ట (కాడలతో సహా శుభ్రం చేసినది)పచ్చిమిరపకాయలు: 5-6 (కారం తగ్గట్టుగా)అల్లం: 1 అంగుళం ముక్కవెల్లుల్లి రెబ్బలు: 10-12పుదీనా ఆకులు: గుప్పెడుజీలకర్ర: 1 చిన్న చెంచాలవంగాలు: 3దాల్చిన చెక్క: 1 చిన్న ముక్కతయారీ విధానం...మిక్సీ జార్‌లో కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క వేసి, అవసరమైతే ఒక్క చెంచా నీళ్లు పోసి మెత్తటి ముద్దలా రుబ్బుకోండి. శుభ్రం చేసిన చికెన్ ముక్కల్లో రుబ్బుకున్న కొత్తిమీర ముద్ద, పసుపు, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి కనీసం 20-30 నిమిషాలు పక్కన ఉంచండి. ఒక మందపాటి బాణలిలో నూనె వేడి చేసి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేంతవరకు వేయించండి. ఉల్లిపాయలు వేగాక, మ్యారినేట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చికెన్ ముక్కలను నూనెలో వేయండి. మంటను మీడియం-హైలో ఉంచి 3-4 నిమిషాలు బాగా వేపండి. ఆ తర్వాత మూతపెట్టి చిన్న మంటపై ముక్కల్లోని నీరు బయటకు వచ్చి ముక్క మెత్తబడే వరకు (సుమారు 10-12 నిమిషాలు) మగ్గనివ్వండి. చికెన్ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత మూత తీసి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, మిరియాల పొడి వేసి బాగా కలపండి. మంటను మీడియంలో ఉంచి చికెన్‌లోని తేమ అంతా ఇంకిపోయి, మసాలా మొత్తం ముక్కలకు పట్టి నూనె పైకి తేలేవరకు అట్లకాడతో కలుపుతూ వేయించండి. చివరగా పచ్చి కొత్తిమీర చల్లుకుని స్టవ్ కట్టేయండి. ఘుమఘుమలాడే కొత్తిమీర చికెన్ ఫ్రై సిద్ధం.నిమ్మకాయ రసం పిండుకుని ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే రుచి అదిరిపోతుంది.

Source link